"రాధేశ్యామ్" చిత్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ.. ఆమె భవిష్యత్తు గురించి విక్రమాదిత్య ఏమి చెప్పాడు..!?

Former Prime Minister Indira Gandhi Character in Prabhas Radhe Shyam Movie
x

"రాధేశ్యామ్" చిత్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ..

Highlights

Former Prime Minister Indira Gandhi in Radhe Shyam Movie: రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటించిన పాన్...

Former Prime Minister Indira Gandhi in Radhe Shyam Movie: రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం "రాధేశ్యామ్" జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్ ని బట్టి చూస్తే ఈ సినిమాలో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చూడబోతున్నట్లు తెలుస్తుంది. 1970 బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కించిన "రాధేశ్యామ్" సినిమాలో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను కూడా చూపించబోతున్నారు.

చేతి రాతలను చూసి భవిష్యత్తు చెప్పే విక్రమాదిత్య పాత్రలో నటించిన ప్రభాస్ "రాధేశ్యామ్" చిత్రంలో ఇందిరాగాంధీ హస్తరేఖలను చూసి ఆమె భవిష్యత్తు గురించి కూడా చెప్పనున్నట్లు తాజాగా విడుదలైన ట్రైలర్ లో అందుకు సంబంధించిన ఒక సన్నివేశాన్ని చూస్తే తెలుస్తుంది. ప్రపంచ దేశ నాయకులంతా కలవాలనుకునే గొప్ప హస్త సాముద్రిక నిపుణుడు.. పామ్ హిస్టరీలో ఐన్ స్టీన్ అయిన విక్రమాదిత్య 1970 సమయంలో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ రాజకీయ భవిష్యత్తుతో పాటు వ్యక్తిగత జీవితం ఎలా ఉండబోతుందని చెప్పాడో తెలియాలంటే ఈ సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

ఇక మొదటి నుండి "రాధేశ్యామ్" సినిమాకి సంబంధించిన వీడియోలలో ట్రైన్ తో పాటు షిప్ ని కూడా కీలకంగా చూపిస్తుండటంతో "రాధేశ్యామ్" కథ మొత్తం వీటి చుట్టూనే తిరుగుతుందని అర్ధమవుతుంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం "రాధేశ్యామ్" చిత్రంలో షిప్ ఫైట్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని సమాచారం. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా యూవి క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories