Game Changer: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో 'గేమ్‌ ఛేంజర్‌' సరికొత్త ట్రెండ్..!

Game Changer: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో గేమ్‌ ఛేంజర్‌ సరికొత్త ట్రెండ్..!
x

Game Changer: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో 'గేమ్‌ ఛేంజర్‌' సరికొత్త ట్రెండ్..!

Highlights

Game Changer: రామ్‌ చరణ్‌ హీరోగా, శంకర్‌ దర్శకత్వంలో గేమ్‌ ఛేంజర్‌ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

Game Changer: రామ్‌ చరణ్‌ హీరోగా, శంకర్‌ దర్శకత్వంలో గేమ్‌ ఛేంజర్‌ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఆకాశన్నంటే అంచనాలు ఉన్నాయి. అంచనాలకు అనుగుణంగా శంకర్‌ ఈ చిత్రాన్ని భారీగా తెరకెక్కిస్తున్నారు. ట్రిపులార్ సినిమాతో నేషనల్ వైడ్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న రామ్‌ చరణ్‌ నటిస్తున్న సినిమా కావవడంతో గేమ్‌ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే భారతీయుడు2 వైఫల్యం తర్వాత శంకర్‌ సైతం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇదిలా ఉంటే సినిమా ప్రకటన చేసినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమాలో వింటేజ్‌ శంకర్‌ను చూస్తారని ఇప్పటికే రామ్‌ చరణ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్‌, పాటలు సినిమాపై అంచనాలకు మరింత చేకూర్చాయని చెప్పాలి. ఇదిలా ఉంటే తాజాగా గేమ్‌ ఛేంజర్‌ మూవీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

ఇంతవరకు టాలీవుడ్‌లో ఎన్నడూ లేని విధంగా అమెరికాలోని డల్లాస్‌ నగంలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు కేవలం పక్క రాష్ట్రాల్లో ఈవెంట్‌లకు పరిమితమైన టాలీవుడ్‌ను గేమ్‌ ఛేంజర్‌ మరో మెట్టు పైకి ఎక్కించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శనివారం గేమ్‌ ఛేంజర్‌ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను అమెరికాలో నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇక ఈ ఈవెంట్‌ను అమెరికా డిస్ట్రిబ్యూటర్ రాజేష్ కల్లేపల్లి గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. హీరో రామ్ చరణ్ తేజ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ లతో పాటు ఈ ఈవెంట్ హోస్ట్ చేయబోతున్న సుమ కూడా ఇప్పటికే డల్లాస్ చేరుకున్నారు. ఇక డల్లాస్‌లో జరిగే ఈ ఈవెంట్‌కు దర్శకుడు శంకర్ తో పాటు బుచ్చిబాబు, సుకుమార్ కూడా హాజరువుతున్నారు. మరి సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతోన్న గేమ్‌ ఛేంజర్‌ మూవీ జవనరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories