Genelia: అవన్నీ జీవితంలో భాగమే, వాటికి పెద్దగా విలువ ఇవ్వను: జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు

Genelia
x

Genelia: అవన్నీ జీవితంలో భాగమే, వాటికి పెద్దగా విలువ ఇవ్వను: జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు

Highlights

Genelia: 2003లో వచ్చిన సత్యం మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార జెనీలియా.

Genelia: 2003లో వచ్చిన సత్యం మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార జెనీలియా. అనంతరం తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ 2006లో వచ్చిన బొమ్మరిల్లుతో భారీ క్రేజ్‌ను దక్కించుకుంది. ఇక సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే 2012లో బాలీవుడ్ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుంది. వివాహం తర్వాత సినిమాలకు క్రమంగా దూరమవుతూ వచ్చిందీ చిన్నది.

అయితే సుమారు 10 ఏళ్ల విరామం తర్వాత ‘వేద్‌’ చిత్రంతో మళ్లీ వెండితెరపై కనిపించింది జెనీలియా. తాజాగా తన కమ్‌బ్యాక్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె సినిమాలకు విరామం తీసుకోవడానికి గల కారణం, తిరిగి నటనలోకి రావడానికి ఎదురైన సవాళ్లు గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా జెనీలియా మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘‘కెరీర్‌లో విజయాలు, అపజయాలకు నేను పెద్దగా విలువ ఇవ్వను. అవి జీవితంలో భాగమే. నాకు కుటుంబం ముఖ్యమైంది. పిల్లలు పుట్టిన తర్వాత వారిపై పూర్తిగా దృష్టి పెట్టాలనిపించింది. అయితే తిరిగి సినిమాల్లోకి రావాలని అనుకున్నప్పుడు, పరిచయస్తులెవరూ నన్ను ప్రోత్సహించలేదు. ‘పదేళ్ల విరామం తర్వాత మళ్లీ నటన? ఇది కుదరదు’ అని చాలా మంది చెప్పారు. వారి మాటలు బాధించాయి. అయినా ధైర్యం చేసి ముందుకు వెళ్లాను. రితేశ్‌తో కలిసి చేసిన ‘వేద్‌’ మంచి విజయం సాధించింది. కాబట్టి, ఇతరుల మాటలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అని జెనీలియా తెలిపారు.

2003లో ‘తుజే మేరీ కసమ్‌’ ద్వారా బాలీవుడ్‌కి పరిచయమైన జెనీలియా, తెలుగులో ‘సై’, ‘బొమ్మరిల్లు’, ‘రెడీ’ వంటి ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించారు. తొలి సినిమా సమయంలోనే బాలీవుడ్ నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి, తర్వాత ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, 10 ఏళ్ల విరామం తీసుకుని ‘వేద్‌’తో రీ-ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ‘మజిలీ’ రీమేక్‌ కాగా, ఆమె నటనను ప్రేక్షకులు విశేషంగా అభినందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories