ఘనంగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కర్టెన్ రైజర్ ఈవెంట్
x

ఘనంగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కర్టెన్ రైజర్ ఈవెంట్

Highlights

సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కర్టెన్ రైజర్ ఈవెంట్ శనివారం సాయంత్రం హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా జరిగింది.

సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కర్టెన్ రైజర్ ఈవెంట్ శనివారం సాయంత్రం హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా జరిగింది. సీనియర్ నటులు మురళీ మోహన్, నిర్మాత కేఎస్ రామారావు, ఫిల్మ్ నగర్ హోసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సూర్యనారాయణ, నిర్మాత ఏడిద రాజా, రామసత్యనారాయణ స్పాన్సర్స్ సూర్య సెమ్ డైరెక్టర్స్ అనిల్ మరియు డా. సురేష్ బాబు, వి. వి. కె. హోసింగ్ ఇండియా ప్రై వెట్ లిమిట్ అధినేత వళ్లూరు విజయకుమార్ తదితరుల ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి శ్రీ విజయ వారహి మూవీస్ సంస్థ ఈ కార్యక్రమానికి కో స్పాన్సర్ గా వ్యవహస్తున్నారు. అలాగే మ్యూజిక్ పాట్నర్ గా ఆదిత్య న్యూజిక్ వ్యవహరిసున్నారు.

ఈ సందర్భంగా అతిథులు చేతుల మీదుగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 ఫంక్షన్ డేట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఫిల్మ్ నగర్ హోసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ - సురేష్ కొండేటితో నాకు సుదీర్ఘ కాల స్నేహం ఉంది. ఆయన మా ఇంటిని అద్దెకు తీసుకుని తన ఫ్యామిలీతో ఒక ఫ్లోర్ లో ఉంటూ మరో ఫ్లోర్ లో సంతోషం మేగజైన్ ఆఫీస్ పెట్టుకున్నారు. ఇప్పటికి 24 ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా ఫిలిం మేగజైన్ నడుపుతున్నారు. ఆయన అందరికీ మిత్రులు. నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. హైదరాబాద్ లో ఏదైనా ఈవెంట్ ఘనంగా చేయాలంటే సురేష్ చేయాలి అనేంతగా పేరు తెచ్చుకున్నారు. 24 ఏళ్లుగా సంతోషం ఈవెంట్ చేస్తున్నాం, ఆయనకు ఏం మిగులుతుందో ఏంటో తెలియదు. కష్టపడతాడు. నవ్వుతూ పలకరిస్తాడు. ఆయన సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కర్టెన్ రైజర్ ఈవెంట్ కూడా సక్సెస్ ఫుల్ గా చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత ఏడిద రాజా మాట్లాడుతూ - సురేష్ కొండేటి అందరికీ మిత్రులు. ఇందాక ఇతర అతిథులు చెప్పినట్లు అందరితో బాగుంటారు. ఆయన ఏ ఈవెంట్ చేసిన వన్ మ్యాన్ షోలా ఉంటుంది. ఆయన సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 ఈవెంట్ ఎంతబాగా చేయబోతున్నాడు అనేది నాకూ చూడాలని ఉంది. సురేష్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

నిర్మాత కేఎస్ రామారావు మాట్లాడుతూ - ఒక సినిమా ఈవెంట్ చేయాలంటే ప్రభుత్వాలకే పదేళ్ల టైమ్ పట్టింది. అలాంటిది ఒక్కడు, సామాన్యుడు సురేష్ కొండేటి 24 ఏళ్లుగా దిగ్విజయంగా సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ చేస్తుండటం మామూలు విషయం కాదు. ఆయనకు సినిమా పరిశ్రమలో ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మీడియా మిత్రులు మరింతగా అతనికి అండగా నిలబడాల్సింది. నేను ఆ టైమ్ లో సురేష్ కు ఏదో ఒకటి చేయాలని ఎఫ్ఎన్ సీసీ కల్చరల్ కమిటీ అడిషనల్ ఛైర్మన్ గా నియమించాను. కానీ ఏ రోజు సురేష్ బాధపడటం నేను చూడలేదు. నవ్వుతూనే ఉన్నాడు. ఈ 24వ అవార్డ్స్ ఈవెంట్ కూడా సక్సెస్ ఫుల్ గా చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

సీనియర్ నటులు మురళీ మోహన్ మాట్లాడుతూ - 24 ఏళ్లుగా అవార్డ్స్ ఈవెంట్ చేస్తున్న ఏకైక మేగజైన్ సంతోషం. సౌత్ ఇండియాలో ఫిలింఫేర్ తప్ప మరో మేగజైన్ ఏదీ కూడా ఇంత సుదీర్ఘ కాలం అవార్డ్స్ ఫంక్షన్స్ చేయలేదు. పెద్ద పెద్ద మీడియా సంస్థలు పెట్టిన అవార్డ్స్ ఫంక్షన్స్ కూడా సక్సెస్ కాలేదు. కానీ సురేష్ ఒక్కడు ఎంతో కష్టపడి 24వ సారి ఈవెంట్ చేస్తున్నాడు. తెలంగాణలో పదేళ్ల తర్వాత గద్దర్ అవార్డ్స్ ఇచ్చారు. ఏపీలో త్వరలో ఫిలిం అవార్డ్స్ ఇవ్వబోతున్నారు. సూర్య చంద్రులకు గ్రహణం పట్టినంత మాత్రాన వారికేం కాదు. అలాగే ఏవో కష్టాలు వచ్చినందుకు సురేష్ కు కూడా ఏం కాదు. నేను ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా, సురేష్ యూట్యూబ్ లో ఇస్తున్న ఫిలిం న్యూస్ డైలీ చూస్తాను. అవి చూస్తే నాకు ఇండస్ట్రీలోని ప్రతి అప్డేట్ తెలుస్తుంది. ఈసారి ఈవెంట్ కు స్పాన్సర్స్ ను ఇస్తున్న మా విజయ్ కుమార్ గారికి మిగతా వారందరికీ థ్యాంక్స్. అలాగే మేమంతా సురేష్ తో ఉన్నాం. ఈ సారి ఈవెంట్ ఘనంగా చేయడానికి సపోర్ట్ చేస్తాం. అన్నారు.

వి. వి. కె. హోసింగ్ ఇండియా ప్రై వెట్ లిమిట్ అధినేత వళ్లూరు విజయకుమార్ మాట్లాడుతూ - సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025కు స్పాన్సరింగ్ చేస్తుండటం హ్యాపీగా ఉంది. నేను గతంలో చాలా ఫంక్షన్ చేసాను ఎక్కువ సంతృప్తిని ఈ సంతోషం ఫిలిం అవార్డ్స్ కు స్పాన్సర్ గా ఉండటం వల్లే కలుగుతోంది. సంతోషం అవార్డ్ తీసుకున్న ప్రతి ఒక్కరిలో ఏదో సాధించామనే గొప్ప ఫీలింగ్ కలుగుతుంది. ఎంతోమందిని ఈ అవార్డ్ తో ప్రోత్సహిస్తున్నారు సురేష్ కొండేటి. ఈ నెల 16న జేఆర్ సీ కన్వెన్షన్ లో జరిగే సంతోషం అవార్డ్స్ ఈవెంట్ గతంలో ఎప్పుడూ జరగనంత ఘనంగా జరగాలని, అందుకు మనమంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

సూర్య సెమ్ డైరెక్టర్ అనిల్ మాట్లాడుతూ - ఒక పనిని ఇన్నేళ్లుగా పట్టుదలగా చేయడం సాధారణ విషయం కాదు. సురేష్ కొండేటి గారు 24 ఏళ్లుగా అవార్డ్స్ ఈవెంట్ నిర్వహించడం గొప్ప విషయం. ఆయనకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా. ఈసారి ఈవెంట్ కూడా ఘనంగా జరపాలని విష్ చేస్తున్నా. అన్నారు.

సూర్య సెమ్ డైరెక్టర్ డా.సురేష్ బాబు మాట్లాడుతూ - మేము చదువుకునే రోజుల్లో హాస్టల్స్ నుంచి బయటకు వెళ్లి దొంగతనంగా సంతోషం ఫిలిం మేగజైన్స్ కొని చదివేవాళ్లం. ఇప్పుడు సంతోషం అవార్డ్స్ ఈవెంట్ కు స్పాన్సర్స్ గా వ్యవహరించడం హ్యాపీగా ఉంది. ఈ అవకాశం మాకు కల్పించిన సురేష్ గారికి థ్యాంక్స్. అన్నారు.

సంతోషం మేగజైన్ అధినేత సురేష్ కొండేటి మాట్లాడుతూ - ఈ రోజు మా సంతోషం అవార్డ్స్ కర్టెన్ రైజర్ ఈవెంట్ కు వచ్చిన పెద్దలు అందరికీ థ్యాంక్స్. 35 ఏళ్లుగా నేను జర్నలిస్ట్ గా ఉన్నాను. 85 కు పైగా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను, 16 సినిమాలు నిర్మించా, అలాగే 600 సినిమాలకు పీఆర్ఓగా పనిచేశా. చిరంజీవి, బాలకృష్ణ, రజినీకాంత్ వంటి స్టార్స్ సినిమాలు పీఆర్ఓగా చేశాను. నాకు చిరంజీవి గారు, నాగార్జున గారు రెండు కళ్లలాంటి వారు. 2002లో ఫస్ట్ సంతోషం ఈవెంట్ లో నాగార్జున గారు ఫిలింఫేర్ అవార్డ్స్ లా సంతోషం అవార్డ్స్ పేరు తెచ్చుకోవాలి అన్నారు. ఆయన మాట మీద నేను కనీసం 25 ఏళ్లు ఫిలిం అవార్డ్స్ ఈవెంట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇది 24వ సంవత్సరం. మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇంత సుదీర్ఘ ప్రయాణం చేయగలుగుతున్నా. 2007లో దుబాయ్ షార్జా క్రికెట్ స్టేడియంలో 40 వేల మంది మధ్య సంతోషం అవార్డ్స్ ఈవెంట్ గ్రాండ్ గా చేశాం. ఇక్కడి నుంచి సూపర్ స్టార్ మహేశ్ బాబు సహా 120 మందిని ఎమిరేట్స్ ఫ్లైట్ లో షార్జా తీసుకెళ్లి ఫంక్షన్ చేశాం. అలాంటిది మొన్న గోవాలో చిన్న చిన్న పొరపాట్లు జరిగితే దాన్ని కొందరు కావాలని ఇష్యూ చేశారు. నేను ఎవరినీ శత్రువుగా భావించను. నా ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్లు శత్రువులు అనుకుంటా. నా మేగజైన్ లో ఇన్నేళ్లలో ఒక్కరి గురించి కూడా తప్పుగా రాయలేదు. నాకు తెలిసి నేను చిత్ర పరిశ్రమలో ఎలాంటి తప్పు చేయలేదు. అవార్డ్స్ ఫంక్షన్ అంటే ముళ్ల కిరీటం లాంటిది. అవార్డ్ ఫంక్షన్స్ వద్దు అని అక్కినేని నాగేశ్వరరావు గారి లాంటి లెజెండ్స్ నాకు సలహా ఇచ్చేవారు. కానీ పట్టుదలగా చేస్తూ వచ్చాను. గోవా ఈవెంట్ కు సౌత్ ఫిలిం ఇండస్ట్రీస్ నుంచి పెద్ద సంఖ్యలో గెస్ట్ లను తీసుకెళ్లాను. అక్కడ రూమ్స్ విషయంలో చిన్న పొరపాటు జరిగింది అంతే. దీని గురించి ఇప్పటిదాకా నేను ఎక్కడా మాట్లాడలేదు. ఏదైనా మనం మాట్లాడితే ఇంకా ఎక్కువ కాంట్రవర్సీ అవుతుందనే ఊరుకున్నా. నేను ఇబ్బందుల్లో ఉన్న టైమ్ లో కేఎస్ రామారావు గారు పిలిచి ఎఫ్ఎన్ సీసీ అడిషనల్ కల్చరల్ కమిటీ ఛైర్మన్ గా నన్ను నియమించి ప్రొచహించారు. ఆయనను నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే గోవా ఈవెంట్ కు వచ్చిన మురళీ మోహన్ గారు అన్నీ చూశారు. ఆయన నాకు ఎప్పుడూ అండగా నిలబడుతుంటారు. ఆ మధ్య తిరుపతి దర్శనానికి వెళ్లినప్పుడు అనిల్ గారు వారి పాట్నర్ తో కలిసి నెక్ట్స్ ఈవెంట్ కోసం పది లక్షల రూపాయల అక్కౌంట్ లో వేశారు. ఆ వెంకటేశ్వరుడే నాకు సపోర్ట్ గా ఉండి ఈవెంట్ చేయమంటున్నాడు అనే ఫీలింగ్ కలిగింది. నా స్పాన్సర్స్ అందిరకీ కృతజ్ఞతలు చెబుతున్నా. మీ అందరి సపోర్ట్ తో ఈసారి ఈవెంట్ కూడా ఘనంగా చేయబోతున్నాం" అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories