Tollywood: ఈ ఫోటోలోని క్రేజీ హీరో చిరునవ్వుతోనే పడేస్తాడు.. అమ్మాయిల కలల రాజకూమారుడు.. ఎవరో గుర్తుపడతారా..?

Guess The Senior Hero in this photo
x

Tollywood: ఈ ఫోటోలోని క్రేజీ హీరో చిరునవ్వుతోనే పడేస్తాడు.. అమ్మాయిల కలల రాజకూమారుడు.. ఎవరో గుర్తుపడతారా..?

Highlights

ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా..క్లూ ఏంటంటే..ఇతడికి ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ హీరోగా ఇంటర్నేషనల్ వైడ్ క్రేజ్ ఉంది.

R.Madhavan: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా..క్లూ ఏంటంటే..ఇతడికి ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ హీరోగా ఇంటర్నేషనల్ వైడ్ క్రేజ్ ఉంది. ఇంకా చెప్పాలంటే..లవర్ బాయ్ ఇమేజ్ ఉంది..అలా నవ్వాడంటే చాలు అమ్మాయిలు ఇలా పడిపోవాల్సిందే..ఏంటి గెస్ చేశారా..ఔను ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి మరెవరో కాదు ఆర్. మాధవన్.

ఇవాళ హీరో మాధవన్ పుట్టినరోజు. 1970 జూన్ 1న బీహార్ లోని జంషెడ్ పూర్ లోని ఓ తమిళ అయ్యంగర్ ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి టాటా స్టీల్ లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పని చేస్తే తల్లి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ గా చేశారు. మాధవన్ విద్యాభ్యాసం ఉత్తరాదిలోనే సాగింది. ఎలక్ట్రానిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేశాడు. పబ్లిక్ స్పీకింగ్, పర్సనాలిటీ డెవలప్ మెంట్ కోర్సులో శిక్షకుడిగా మారిన మాధవన్ ఆ తర్వాత మోడలింగ్ రంగంలో అడుగుపెట్టాడు. అలా తొలిసారిగా మాధవన్ శాండల్ వుడ్ టాల్కమ్ పౌడర్ యాడ్ లో నటించాడు.

మాధవన్ నటించిన యాడ్ ను సంతోష్ శివన్ డైరెక్ట్ చేశారు. ఈ పరిచయంతోనే మాధవన్ ను ఇరువర్ అంటే మన తెలుగులో ఇద్దరు మూవీ కోసం మణిరత్నంకు సంతోష్ శివన్ రికమండ్ చేశారు. స్క్రీన్ టెస్ట్ కూడా ఇచ్చాడు. కానీ సెలక్ట్ కాలేదు. అయితే మణిరత్నం తన అలైపాయుదే..అంటే తెలుగులో సఖి చిత్రంలో కథానాయకుడిగా మాధవన్ కు బ్రేక్ ఇచ్చాడు. సఖి సినిమాతో మాధవన్ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఇక ఆ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన మిన్నలే అదే తెలుగులో చెలి, మద్రాస్ టాకీస్ వారి డుండుండుం సినిమాలతో అమ్మాయిల కలల రాకుమారుడిగానే కాదు విమర్శకులు మెచ్చిన నటుడిగా ఎదిగాడు.

మాధవన్ వెండితెరకు పరిచయం కాకముందు పలు టీవీ సీరియల్స్ లో నటించాడు. బనేగీ అప్నీ బాత్, ఘర్ జమాయి, సీ హాక్స్ ఇలా పలు సీరియల్స్ తో పాటు మణిరత్నం మూవీ కంటే ముందు ఓ బాలీవుడ్ సినిమాలో అతిథి పాత్రను చేశాడు కూడా. ఇక ఆయన తొలిచిత్రం కన్నడలో చేశాడు. నటుడు అబ్బాస్ తో పాటు చేసిన ఆ సినిమా శాంతి శాంతి శాంతి. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఎవరూ గుర్తించలేదు. ఇదే సమయంలో హిందీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యే అవకాశం లభించింది. అఖేలీ టైటిల్ తో మొదలైన ఆ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లోనే అటకెక్కేసింది. ఇలా లవర్ బాయ్ గా గుర్తింపు రాకముందు మాధవన్ ఇండస్ట్రీలో బాగా స్ట్రగుల్ అయ్యాడు. మణిరత్నం చేతిలో పడిన తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది.

లవ్ స్టోరీ సినిమాలతో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న మాధవన్ ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను చేస్తున్నాడు. గత ఏడాది రాకెట్రీ నంబి ఎఫెక్ట్ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబినారాయణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో టైటిల్ రోల్ ని పోషిస్తూ మాధవన్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు. ఈ సినిమా సూపర్ హిట్టవ్వడంతో మరో బయోపిక్ పై కన్నేశాడు.

తమిళ ప్రఖ్యాత శాస్త్రవేత్త జీడీ నాయుడు బయోపిక్ లో మాధవన్ నటించబోతున్నాడు. ఈ సైంటిస్ట్ ఇండియన్ ఫస్ట్ ఎలక్ట్రిక్ మోటార్ ని కనిపెట్టారు. ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అలాగే ప్రఖ్యాతి లాయర్ సి. శంకరన్ నాయర్ బయోపిక్ లో కూడా నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి, 51వ ఏటలో అడుగుపెట్టిన మాధవన్ మరెన్నో విలక్షణ చిత్రాల్లో నటించి మనల్ని మెప్పించాలని కోరుకుంటూ..బర్త్ డే విషెస్ చెప్పేదాం..హ్యాపీ బర్త్ డే మాధవన్ సార్.

Show Full Article
Print Article
Next Story
More Stories