Prashanth Varma : అడ్వాన్స్‌లు తీసుకుని.. ప్రాజెక్టులు ఆలస్యం.. ఆ డైరెక్టర్ పై నిర్మాతలు గరంగరం

Prashanth Varma
x

Prashanth Varma : అడ్వాన్స్‌లు తీసుకుని.. ప్రాజెక్టులు ఆలస్యం.. ఆ డైరెక్టర్ పై నిర్మాతలు గరంగరం

Highlights

Prashanth Varma : ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ సినిమా ఒక సాధారణ దర్శకుడిని స్టార్‌గా మార్చేస్తుంది.

Prashanth Varma: ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ సినిమా ఒక సాధారణ దర్శకుడిని స్టార్‌గా మార్చేస్తుంది. హనుమాన్ సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ విషయంలో ఇదే జరిగింది. ఆయన విజయాన్ని చూసి ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆయన అడిగినంత అడ్వాన్స్ ఇచ్చి, తమ ప్రాజెక్టులకు సంతకాలు చేయించుకున్నాయి. అయితే, తాజాగా ఈ దర్శకుడి తీరు పట్ల ప్రముఖ నిర్మాణ సంస్థలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. హోంబలే ఫిల్మ్స్, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి పెద్ద బ్యానర్లతో పాటు మరికొన్ని సంస్థలు కూడా ప్రశాంత్ వర్మ వృత్తిపరమైన వైఖరిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అడ్వాన్స్‌లు తీసుకున్న ప్రశాంత్ వర్మ, ఇప్పుడు ప్రాజెక్టులు మొదలు పెట్టడంలో జాప్యం చేస్తుండటంపై ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదులు అందినట్లు సమాచారం.

ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ విజయం తర్వాత ఆయనకు తెలుగు చిత్ర పరిశ్రమలో డిమాండ్ అమాంతం పెరిగింది. సినిమా సూపర్ హిట్ కాగానే, పలు పెద్ద నిర్మాణ సంస్థలు ప్రశాంత్ వర్మ అడిగినంత అడ్వాన్సు ఇచ్చి, తమ బ్యానర్లలో సినిమా చేయడానికి ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో కేజీఎఫ్, కాంతారా వంటి చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి.

ప్రశాంత్ వర్మ ఈ అడ్వాన్స్‌ల ద్వారా వచ్చిన వందల కోట్ల రూపాయలను తన సొంత స్టూడియో, ఆఫీసు నిర్మాణానికి ఉపయోగించినట్లు సమాచారం. పెద్ద మొత్తంలో అడ్వాన్స్ తీసుకున్న తర్వాత, ప్రశాంత్ వర్మ కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడంలో జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన వృత్తిపరమైన వైఖరిపై కొందరు నిర్మాతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలస్యం కారణంగానే కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మెట్లు ఎక్కి, ప్రశాంత్ వర్మపై అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వివాదంపై డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థ స్పందించింది. తమకూ, ప్రశాంత్ వర్మాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆ సంస్థ ప్రకటించింది. కానీ, ఇతర నిర్మాణ సంస్థలు మాత్రం ఈ అంశంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ప్రశాంత్ వర్మ గతంలో కూడా తన వైఖరి కారణంగా వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. గతంలో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌తో ప్రశాంత్ వర్మ ఒక సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. రణ్‌వీర్ సింగ్ ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ సమయంలో ప్రశాంత్ వర్మ వైఖరే రణ్‌వీర్ వైదొలగడానికి కారణమని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాను ప్రకటించారు. ఇందులో రిషబ్ శెట్టి నటించనున్నారు. అలాగే, ప్రభాస్‌తో కలిసి ఒక సూపర్ హీరో సినిమా తీయడానికి హోంబలే నుంచి అడ్వాన్స్ తీసుకున్నట్లు సమాచారం. హిందూ దేవతల కథాంశాలతో ఒక సూపర్ హీరో యూనివర్స్‌ను సృష్టిస్తానని ఆయన గతంలో ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories