Vishal Injured: షూటింగ్‌లో తీవ్రంగా గాయపడిన హీరో విశాల్

Vishal Injured: కోలీవుడ్‌ నటుడు విశాల్‌ మరోసారి తీవ్రంగా గాయపడ్డారు.

Arun Chilukuri
Updated on: 21 July 2021 3:03 PM IST
Hero Vishal Injured at Shooting Spot in Hyderabad
X

Hyderabad: షూటింగ్‌లో తీవ్రంగా గాయపడిన హీరో విశాల్

Vishal Injured: కోలీవుడ్‌ నటుడు విశాల్‌ మరోసారి తీవ్రంగా గాయపడ్డారు. ఫైట్‌ షూటింగ్‌ జరుగుతుండగా గోడను ఢీకొని కిందపడిపోయారు. విశాల్‌ ప్రస్తుతం 'నాట్‌ ఏ కామన్‌ మ్యాన్‌' మూవీలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూట్‌ జరుగుతోంది. డైరెక్టర్ శరవణన్ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎంతో ఎనర్జిటిక్‌గా సాగుతోన్న క్లైమాక్స్‌ ఫైట్‌ సీక్వెన్స్‌లో విశాల్ బలంగా గోడను ఢీకొని కిందపడిపోయారు.

ఈ ప్రమాదంలో విశాల్‌ వెన్ను భాగానికి దెబ్బతగిలింది. ప్రస్తుతం ఆయన వైద్యుల సమక్షంలో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. విశాల్‌ ఆరోగ్యంగానే ఉన్నారని చిత్ర యూనిట్‌ వెల్లడించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇదిలా ఉండగా గతంలోనూ 'నాట్‌ ఏ కామన్‌ మ్యాన్‌' షూట్‌లో తీవ్రంగా గాయపడ్డారు విశాల్‌. ఫైట్‌ సీక్వెన్స్‌ సమయంలో సమన్వయ లోపం ఏర్పడటంతో ఆయన తలకు, కంటికి స్వల్ప గాయాలయ్యాయి. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విశాల్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.