Vice President - Vishal: ఉపరాష్ట్రపతితో హీరో విశాల్ భేటీ, ఎందుకో తెలుసా?

Kranthi
Updated on: 12 July 2021 11:42 AM IST
Hero Vishal Met Honourable Vice President of India Venkaiah Naidu
X

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు-విశాల్: (ట్విటర్ ఫోటో)

Vice President Venkaiah Naidu - Vishal: కోలీవుడ్ స్టార్ విశాల్ తన సోదరితో పాటు వెళ్లి భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో భేటీ అయ్యి పలు అంశాలను చర్చించారు. అనంతరం విశాల్ మీడియాతో మాట్లాడుతూ తాను ఏర్పాటు చేసిన 'కనెక్టింగ్ కమ్యూనికేటింగ్ ఛేంజింగ్' అనే కొత్త సేవా సంస్థ ద్వారా సమాజ సేవ ఎలా చేపడుతున్నానో ఆయనకు వివరించినట్టు విశాల్ పేర్కొన్నారు.

తాను చేపడుతున్న సేవాకార్యక్రమాలపై ఉప రాష్ట్రపతి మెచ్చుకున్నారని, ఎంతో బిజీగా ఉండే భారత ఉప రాష్ట్రపతి తాను కోరగానే ఆయన విలువైన సమయాన్ని నా కోసం కేటాయించడం. తాను చెప్పిన విషయాలను ఆయన వినడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆయనకు ఆ దేవుడు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో విశాల్ పోస్ట్ చేశారు.

Kranthi

Kranthi

Next Story