Star heroes: ప్రభాస్ బాటలోనే మిగతా హీరోలు..

heroes do the feat that is possible only for prabhas
x

ప్రభాస్ బాటలోనే మిగతా హీరోలు.

Highlights

కొందరు స్టార్ హీరోలు ఏడాదికి రెండు సినిమాలు చేస్తుంటే మరికొందరు హీరోలు ఒక్క సినిమాకు రెండేళ్లు టైమ్ తీసుకుంటున్నారు. దీంతో వారి సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Star heroes: కొందరు స్టార్ హీరోలు ఏడాదికి రెండు సినిమాలు చేస్తుంటే మరికొందరు హీరోలు ఒక్క సినిమాకు రెండేళ్లు టైమ్ తీసుకుంటున్నారు. దీంతో వారి సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకుంటున్నారు. అయితే తాము ఏడాదికి రెండు సినిమాలు చేయడానికి రెడీ అంటూ హీరోలు చాలామంది స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. కానీ ఇది వాళ్లు చెప్పినంత ఈజీనా? నిజంగానే మన స్టార్ హీరోలు ఏడాదికి రెండు సినిమాలు చేయగలరా? ప్రభాస్ ఒక్కడికే సాధ్యమవుతున్న ఈ ఫిట్‌ను మిగిలిన వాళ్లు చేసి చూపిస్తారా?.

ప్రస్తుతం స్టార్ హీరోలలో ప్రభాస్ ఒక్కరే వేగంగా సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది రాజా సాబ్ విడుదల కానుంది. అలాగే హను రాఘవపూడి ఫౌజీ కూడా తక్కువ గ్యాప్‌లోనే రానుంది. అంటే ఇవి రెండు సినిమాలు ఈ ఏడాది వస్తాయి. అలాగే సలార్, కల్కి2, స్పిరిట్ లాంటి సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇవన్నీ రాబోయే రెండేళ్లలోనే విడుదల కానున్నాయి. అంటే ఇప్పుడు ప్రభాస్ చేతిలో మొత్తం ఐదు సినిమాలు ఉన్నాయి.

ఇక మిగతా హీరోలు ప్రభాస్ లాగే తాము వేగంగా సినిమాలు చేయాలని భావిస్తున్నారు. అందులో రామ్ చరణ్ ముందున్నారు. గేమ్ ఛేంజర్ కోసం మూడేళ్లు టైం తీసుకున్న ఆయన.. బుచ్చిబాబు సినిమాను మాత్రం 6 నెలల్లో పూర్తి చేయాలని చూస్తున్నారు. గేమ్ ఛేంజర్ కోసం అంత టైం తీసుకున్నా.. థియేటర్ వద్ద ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో తర్వాత సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబుతో చెర్రీ చేస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే డిసెంబర్‌లోనే ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం. ఆ తర్వాత సుకుమార్ లైన్‌లో ఉన్నారు.

ఎన్టీఆర్ వార్2 మూవీతో ఆగస్టు 14న రానున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా సిద్ధంగా ఉంది. ఆ తర్వాత దేవర 2 మూవీ చేయనున్నారు. వీటిని రెండేళ్లలో పూర్తి చేయాలని ఎన్టీఆర్ టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇక సీనియర్ హీరోలు చిరు, బాలయ్య మాత్రం ఏడాదికి రెండు సినిమాల లక్ష్యంతోనే పని చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్‌కు పుష్ప 3 మూవీ ఉంది. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో మరో సినిమా రెడీగా ఉన్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం ఈ హీరోలంతా తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరగా వాటిని పూర్తి చేయాలని చూస్తున్నారు. కానీ వారు చేస్తున్న సినిమాలు అనుకున్న టైంకి పూర్తవుతాయా లేదా అనేది చూడాలి మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories