Heroine Ramya: రష్మికపై ట్రోలింగ్ ఆపండి.. నటి రమ్య రిక్వెస్ట్

Heroine Ramya React Rashmika Trolling On Social Media
x

 రష్మికపై ట్రోలింగ్ ఆపండి.. నటి రమ్య రిక్వెస్ట్

Highlights

రష్మిక మందన్నా ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.‌ అలాంటి రష్మిక తన సొంత రాష్ట్రం కర్ణాటకలోనే తీవ్రమైన ట్రోలింగ్ బారిన పడ్డారు. ఈ క్రమంలోనే రష్మికపై జరుగుతున్న ట్రోలింగ్ పై కన్నడ నటి రమ్య స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Heroine Ramya: రష్మిక మందన్నా ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.‌ అలాంటి రష్మిక తన సొంత రాష్ట్రం కర్ణాటకలోనే తీవ్రమైన ట్రోలింగ్ బారిన పడ్డారు. ఈ క్రమంలోనే రష్మికపై జరుగుతున్న ట్రోలింగ్ పై కన్నడ నటి రమ్య స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇక నటిగా, రాజకీయ నాయకురాలిగా రమ్య సుపరిచితురాలే. తాజాగా బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మాట్లాడుతూ రష్మికకు అండగా నిలిచారు. మహిళలు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారని కాబట్టి సోషల్ మీడియాలో వారిపై ట్రోలింగ్ ఆపాలని కోరారు. సినిమా రంగంలోనే కాదు.. అన్నిరంగాల్లోనూ మహిళలకు అన్యాయం జరుగుతుందన్నారు. దీనికి వ్యతిరేకంగా మనమందరం ఐక్యం కావాలి అని నటి రమ్య చెప్పుకొచ్చారు. ఈ మధ్య కాలంలో రష్మిక మందన్నా ఎక్కువగా ట్రోలింగ్‌కి గురయ్యారని.. అయినప్పటికీ ఆమె చాలా హుందాగా వ్యవహరించారని అన్నారు.

ఓ స్టేజ్ పై తన నేటివ్ ప్లేస్ గురించి మాట్లాడుతూ హైదరాబాద్ అని చెప్పినందుకు ఆమెపై పగబట్టి ట్రోల్ చేశారని ఇది సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్రోల్ చేసేవారు మహిళలు ఎదుర్కొనే మానసిక క్షోభను కూడా అర్థం చేసుకోవాలని.. ఇకనైనా రష్మికపై ట్రోలింగ్ ఆపాలని రమ్య రిక్వెస్ట్ చేశారు.

రష్మిక ఛావా ప్రమోషన్స్‌లో భాగంగా తన సొంతూరు హైదరాబాద్ అని పొరపాటున చెప్పింది. ఈ సంఘటన తర్వాత కన్నడ సినీ పరిశ్రమకి చెందిన ఓ ఈవెంట్‌లో పాల్గొనడానికి ఇన్విటేషన్ పంపించగా రష్మిక పెద్దగా పట్టించుకోలేదని.. ఇటీవల కాంగ్రెస్ నేత రష్మికపై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో రష్మిక కన్నడ సినీ పరిశ్రమని పక్కన పెడుతోందని పుకార్లు వినిపించాయి. దీంతో కొందరు కన్నడ ఫ్యాన్స్ రష్మికని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. అయినప్పటికీ రష్మిక మాత్రం ఈ ట్రోలింగ్ పై చాలా కూల్‌గా స్పందించారు.

రమ్య తెలుగులో కళ్యాణ్ రామ్ అభిమన్యు చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది. అది ఫ్లాప్ కావడంతో పూర్తిగా కన్నడకే పరిమితమైంది. ఇక రష్మిక విషయానికొస్తే.. వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఛావాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories