Mahavatar Narsimha : ఊహించని పరిణామం.. పాకిస్తాన్‌లో మహావతార్ నరసింహ సినిమా ప్రదర్శన

Mahavatar Narsimha : ఊహించని పరిణామం.. పాకిస్తాన్‌లో మహావతార్ నరసింహ సినిమా ప్రదర్శన
x

Mahavatar Narsimha : ఊహించని పరిణామం.. పాకిస్తాన్‌లో మహావతార్ నరసింహ సినిమా ప్రదర్శన

Highlights

హొంబాలే ఫిల్మ్స్ నిర్మాణంలో 2025లో విడుదలై మహావతార నరసింహ సినిమా దేశవ్యాప్తంగా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం రూ. 300 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసిన భారతదేశపు మొట్టమొదటి యానిమేటెడ్ సినిమాగా చరిత్ర సృష్టించింది.

Mahavatar Narsimha :హొంబాలే ఫిల్మ్స్ నిర్మాణంలో 2025లో విడుదలై మహావతార నరసింహ సినిమా దేశవ్యాప్తంగా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం రూ. 300 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసిన భారతదేశపు మొట్టమొదటి యానిమేటెడ్ సినిమాగా చరిత్ర సృష్టించింది. 2026 ఆస్కార్ అవార్డుల పోటీలో కూడా నిలిచేందుకు అర్హత సాధించిన ఈ సినిమా, ఇప్పుడు మరో ఆశ్చర్యకరమైన ఘనతను సొంతం చేసుకుంది. ఏకంగా పాకిస్తాన్‌లో ఈ సినిమాను ప్రదర్శించడం విశేషం.

కరాచీ మందిరంలో ప్రత్యేక ప్రదర్శన

భక్త ప్రహ్లాదుని కథాంశంతో, విష్ణు పురాణం, నరసింహ పురాణాల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం, భారతదేశంలో వివిధ భాషలలో విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఓటీటీలో కూడా దుమ్ము రేపింది. అయితే పాకిస్తాన్‌లో ఈ సినిమాను థియేటర్లలో కాకుండా, కరాచీలోని స్వామి నారాయణ మందిరంలో అక్కడి హిందూ భక్తుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను వీక్షించడానికి వేలాది మంది భక్తులు దేవాలయం ఆవరణలో గుమిగూడారు.



గుడి ఆవరణలో ఏర్పాటు చేసిన పెద్ద ఎల్ఈడీ స్క్రీన్‌పై భక్తులు సినిమా చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 'పాకిస్తాన్‌లో మొట్టమొదటిసారి! స్వామి నారాయణ మందిరంలో మహావతార నరసింహ సినిమా ప్రదర్శన' అనే క్యాప్షన్‌తో ఈ వీడియో పోస్ట్ చేయబడింది.

సినిమా వివరాలు

'మహావతార నరసింహ' సినిమాను హొంబాలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. అశ్విన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పురాణాల కథాంశాన్ని అత్యంత అద్భుతంగా యానిమేట్ చేసిన ఈ చిత్రం, భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories