Movies: మంచు ల‌క్ష్మీ, హ‌నీ రోజ్ మ‌ధ్య హాట్ కెమెస్ట్రీ.. లెస్బియ‌న్స్‌గా న‌టించిన మూవీ ఏంటో ఏంటో తెలుసా?

Movies: మంచు ల‌క్ష్మీ, హ‌నీ రోజ్ మ‌ధ్య హాట్ కెమెస్ట్రీ.. లెస్బియ‌న్స్‌గా న‌టించిన మూవీ ఏంటో ఏంటో తెలుసా?
x
Highlights

Movies: తెలుగు ప్రేక్షకులను తన అందం, నటనతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ హనీ రోజ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నిలేదు.

Movies: తెలుగు ప్రేక్షకులను తన అందం, నటనతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ హనీ రోజ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నిలేదు. నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాలో ఆమె చేసిన పాత్రకి మంచి పేరు వచ్చింది. కానీ ఆ తర్వాత మరో తెలుగు సినిమాలో హనీ కనిపించలేదు.

కాగా హనీ రోజ్ సినీ ప్రస్థానం మలయాళ ఇండస్ట్రీ నుంచి ప్రారంభమైంది. తెలుగులోకి రాకముందే అక్కడి సినిమాల్లో మంచి గుర్తింపు సంపాదించింది. అదే క్రమంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి మాన్‌స్టర్ అనే చిత్రంలో నటించింది.

ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. హనీ రోజ్, లక్ష్మీ మంచు కలిసి న‌టించారు. సినిమాలో ఇద్దరూ లెస్బియన్ క్యారెక్టర్స్‌గా కనిపించారు. సినిమాలో క్లైమాక్స్‌లో డీప్ లిప్ లాక్ సీన్, బెడ్ సీన్లు ఉన్నాయి. ఈ సన్నివేశాలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి.

మాన్‌స్టర్ సినిమా విడుదలై కొంత కాలమైనా, ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ సినిమాకు సంబంధించిన సీన్లు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హనీ రోజ్ – మంచు లక్ష్మీ మధ్య ఉన్న రొమాంటిక్ సీన్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ మలయాళ థ్రిల్లర్ తెలుగులో డబ్ అయ్యి కూడా విడుదలైంది. ఆన్‌లైన్‌లో ఈ సినిమా సీన్‌లు అందుబాటులో ఉండటంతో క్లిప్స్ వైర‌ల్ అవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories