Drugs Case: డొంక కదులుతోంది.. హీరో నవదీప్‌కు నోటీసులు జారీ చేయనున్న పోలీసులు

Drugs Case: హైదరాబాద్ మాదాపూర్‌ డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 15 Sept 2023 1:14 PM IST
Hyderabad Police to Serve Notice to Hero Navdeep
X

Drugs Case: డొంక కదులుతోంది.. హీరో నవదీప్‌కు నోటీసులు జారీ చేయనున్న పోలీసులు

Drugs Case: హైదరాబాద్ మాదాపూర్‌ డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో హీరో నవదీప్‌కు పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. గచ్చిబౌలిలోని స్నార్ట్‌ పబ్‌తో పాటు జూబ్లీహిల్స్‌ టెర్రా కేఫ్‌లో డ్రగ్స్‌ విక్రయాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అయితే.. షాడో సినిమా నిర్మాత ఉప్పలపాటి రవి మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఈయనతో పాటు పరారీలో ఉన్న మోడల్ శ్వేత కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

గతంలో డ్రగ్స్‌ కేసులో పట్టుబడ్డ కబాలి తెలుగు వెర్షన్‌ ప్రొడ్యూసర్‌ కేపీ చౌదరి లిస్ట్‌లోనూ మోడల్‌ శ్వేత పేరు ఉన్నట్టు సమాచారం. ఈమెతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్ కలహర్‌ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల లిస్ట్‌లో మరికొంతమంది సినీ ఇండస్ట్రీకి చెందినవారు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. డ్రగ్స్ వాడిన నిందితులను రిమాండ్‌కు తరలించారు పోలీసులు. మరోవైపు.. పలు పబ్‌లపై నార్కోటిక్ పోలీసులు నిఘా ఉంచారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story