iBomma లో సినిమా చూశారా? మీ డేటా గల్లంతయ్యే ప్రమాదం!

iBomma లో సినిమా చూశారా? మీ డేటా గల్లంతయ్యే ప్రమాదం!
x

iBomma లో సినిమా చూశారా? మీ డేటా గల్లంతయ్యే ప్రమాదం!

Highlights

తెలుగు ప్రేక్షకులకు ఐ-బొమ్మ, బప్పం టీవీ వంటి పైరసీ వెబ్‌సైట్లు అంతుపట్టని పేర్లు కావు. తాజా సమాచారం ప్రకారం, ఈ వెబ్‌సైట్ల నిర్వాహకుడు రవిని తెలంగాణ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ ద్వారా అరెస్ట్ చేశారు.

తెలుగు ప్రేక్షకులకు ఐ-బొమ్మ, బప్పం టీవీ వంటి పైరసీ వెబ్‌సైట్లు అంతుపట్టని పేర్లు కావు. తాజా సమాచారం ప్రకారం, ఈ వెబ్‌సైట్ల నిర్వాహకుడు రవిని తెలంగాణ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ ద్వారా అరెస్ట్ చేశారు. విచారణలో అతడు 50 లక్షల ఐ-బొమ్మ యూజర్ల డేటాను ₹20 కోట్లకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.


ఇది తెలుసుకున్న తర్వాత, యూజర్లు భారీ రిస్క్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. భారతీయ, అంతర్జాతీయ సైబర్ ముఠాలు ఈ డేటాను కొనుగోలు చేశారంటే, దానితో వారు ఏ స్థాయిలో స్కామ్‌లను ప్లాన్ చేస్తున్నారో ఊహించడం కష్టమని అధికారులు చెబుతున్నారు.

వ్యక్తిగత డేటా అనేది కేవలం ఫోటోలు, వీడియోలకే పరిమితం కాదు.

ఫోన్ లేదా బ్రౌజర్ (క్రోమ్)‌లో సేవ్ చేసిన:

బ్యాంక్ వివరాలు

పర్సనల్ ఫోటోలు

ప్రైవేట్ వీడియోలు

ఏకాంతమైన ఫోటోలు

ఇవి కూడా ఐ-బొమ్మ, బప్పం టీవీ ద్వారా యాక్సెస్ చేసి, సేకరించి, అమ్మేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పటికే వివిధ ఆన్‌లైన్ స్కామ్‌లతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు, ఈ డేటా లీక్ వల్ల మరో కొత్త సమస్య తలెత్తే అవకాశం ఉందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, ఐ-బొమ్మ యూజర్లు వెంటనే తమ పాస్‌వర్డ్‌లు మార్చుకోవడం అత్యంత అవసరం అని నిపుణుల హెచ్చరిక.

Show Full Article
Print Article
Next Story
More Stories