
పవన్ కల్యాణ్–సురేందర్ రెడ్డి కాంబోలో ప్రభాస్ హీరోయిన్?
'పవర్ స్టార్' పవన్ కల్యాణ్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
'పవర్ స్టార్' పవన్ కల్యాణ్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ స్ట్రాంగ్ బజ్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ‘ఫౌజీ’ సినిమాలో నటించిన హీరోయిన్ ఇమాన్వి ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రీ–ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ ఎంపికపై మేకర్స్ సీరియస్‌గా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఇమాన్వి పేరు బలంగా వినిపిస్తోంది.
ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ'. ఈ సినిమాని 2026 దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇమాన్వి నటించారు. ఇమాన్వి తన నటనతో పాటు స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుందన్న టాక్ ఉంది. పవన్ కల్యాణ్ సరసన కొత్తగా కనిపించే ఫ్రెష్ ఫేస్ అయితే బాగుంటుందనే ఆలోచనతో మేకర్స్ ఉన్నారని సమాచారం. సురేందర్ రెడ్డి స్టైల్ యాక్షన్–ఎమోషన్ బ్యాలెన్స్‌కు ఇమాన్వి సూటవుతుందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
అన్నీ అనుకున్నట్లే జరిగితే.. పవన్ కల్యాణ్–సురేందర్ రెడ్డి కాంబోకు ఇది మరో హై–వోల్టేజ్ అడిషన్‌గా మారే అవకాశముంది. హీరోయిన్ ఫైనల్ అవుతుందా? లేక మరో పేరు తెరపైకి వస్తుందా? అన్నది తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. టాలీవుడ్లో ఈ ప్రాజెక్ట్‌పై బజ్ మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 26న రిలీజ్ కానుంది. అదే నెలలో పవన్ కొత్త ప్రాజెక్ట్ కూడా ప్రారంభం కానుందని సమాచారం. ఉగాది సందర్భంగా మార్చి 19న పూజా కార్యక్రమాలు జరగనున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ తొలి వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి.
- Pawan Kalyan
- Surender Reddy
- Imanvi
- Imanvi Pawan Kalyan
- Imanvi New Movie
- Imanvi Next Project
- Pawan Kalyan Surender Reddy movie
- Imanvi heroine buzz
- Fauji movie heroine
- Prabhas Fauji film
- Pawan Kalyan upcoming movie
- Surender Reddy action film
- Tollywood latest buzz
- Pawan Kalyan next project
- Imanvi Set to Star Opposite Pawan Kalyan

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




