ప్రభాస్ ప్రేమకథలకు గుడ్ బై చెప్పనున్నారా?

ప్రభాస్ ప్రేమకథలకు గుడ్ బై చెప్పనున్నారా?

admin1
Published on: 21 April 2022 12:33 PM IST
Is Prabhas Going to Reject love Stories | Telugu Latest News
X

ప్రభాస్ ప్రేమకథలకు గుడ్ బై చెప్పనున్నారా?

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరియర్ లో ఇప్పటికే చాలా ప్రేమకథలు తీశారు. వర్షం, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ ఇలా ప్రభాస్ నటించిన చాలావరకు ప్రేమకథలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అయితే చాలా కాలం తర్వాత ప్రభాస్ "రాధే శ్యామ్" అనే సినిమాతో మరొక ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి రాధాకృష్ణ దర్శకత్వం వహించారు.

భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యింది అంటే ప్రభాస్ స్టామినా ను ప్రశ్నించే ఫలితం అది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ ఈ సినిమాలోని తప్పొప్పుల గురించి మాట్లాడారు. ఇప్పుడు అభిమానులు తనని రొమాంటిక్ గా చూడాలి అని అనుకోవటం లేదేమో అలాంటి సాఫ్ట్ క్యారెక్టర్లు తనకి నప్పవేమో అని అన్నారు.

అది నిజం. వర్షం డార్లింగ్ వంటి సినిమాలు చేసినప్పటికీ ఇప్పటికీ ప్రభాస్ వయసు పెరిగింది. రొమాంటిక్ సినిమాలు చేసే వయసు కాదు ఇది. దీంతో ఇకపై లవ్ స్టోరీ లకి ప్రభాస్ గుడ్బై చెప్పబోతున్నారు, ప్రేమ కథలకి దూరంగా ఉంటూ ప్రభాస్ యాక్షన్ సినిమాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

admin1

admin1

Next Story