Ravanasura: రవితేజ "రావణాసుర" రీమేక్ సినిమానా కాదా?

Is Ravi Tejas Ravanasura Movie Remake Movie Or Not
x

రవితేజ "రావణాసుర" రీమేక్ సినిమానా కాదా? 

Highlights

* అందుకే "రావణాసుర" బృందం సైలెంట్ గా ఉందా?

Ravanasura: భాషతో సంబంధం లేకుండా ఇప్పటికే ఎన్నో విభిన్న భాషల నుంచి సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. అలా రీమేక్ సినిమాలగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన సినిమాలు కూడా ఉన్నాయి. చాలామంది ఈ సినిమా మొదలు పెట్టే ముందే ఇది రీమేక్ సినిమా అని క్లారిటీ ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ పద్ధతి కొంచెం కొంచెంగా మారుతుంది. ఏదైనా సినిమాని రీమేక్ చేయాలంటే దానికి గాను కోట్లు ఖర్చు చేసి మరి రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేయాల్సి వస్తోంది.

కానీ తాజాగా మాస్ మహారాజా రవితేజ హీరోగా త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న రావణాసుర చిత్ర బృందం మాత్రం ఇది రీమేక్ సినిమానా కాదా అని క్లారిటీ ఇవ్వటం లేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. బెంగాలీ సినిమా "విన్సీ డా" కీ రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ చిత్ర బృందం మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోవటం లేదు. ఈ సినిమాకి డైలాగ్స్ తో పాటు కథ ను కూడా శ్రీకాంత్ విస్సా అందించారు.

ఇది రీమిక్స్ సినిమానా అని ఆయననే అడగగా, "మీరు ఏ సినిమాకి రీమేక్ అనుకుంటున్నారో ఆ సినిమా చూడండి ఆ తర్వాత ఈ సినిమా చూడండి. అప్పుడు రెండిటికి మధ్య తేడా మీకే తెలుస్తుంది," అని తప్పించుకున్నారు తప్ప సూటిగా సమాధానం చెప్పలేదు. అయితే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అని ఈ సినిమాలో ఉండే మెయిన్ ట్విస్ట్ కథకి చాలా కీలకమని తెలుస్తోంది. ఒకవేళ ఇది ఏ సినిమాకి రీమేక్ అని చెబితే ఆ సినిమా ముందే చూసేస్తే ట్విస్ట్ తెలిసిపోతుంది అందుకే చిత్ర బృందం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వటం లేదని మరికొందరు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories