Samantha: రెండో భర్త విషయంలో కూడా సమంత అదే తప్పు చేస్తుందా..?

Samantha: రెండో భర్త విషయంలో కూడా సమంత అదే తప్పు చేస్తుందా..?
x
Highlights

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, తన జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను తట్టుకుని నిలబడటమే కాకుండా, ప్రతిసారీ ఒక కొత్త రూపంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, తన జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను తట్టుకుని నిలబడటమే కాకుండా, ప్రతిసారీ ఒక కొత్త రూపంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత అక్కినేని అనే ట్యాగ్‌ను తొలగించి, కేవలం సమంతగా తన బ్రాండ్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లింది. అయితే, ఇప్పుడు బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో పెళ్లి తర్వాత, ఆమె తన పేరును సమంత నిడిమోరుగా మార్చుకోబోతుందనే వార్త అభిమానుల్లో కలవరం రేపుతుంది.

నందినీ రెడ్డి దర్శకత్వంలో రాజ్ నిడిమోరు క్రియేటర్ గా వస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా సమంత కెరీర్‌కు అత్యంత కీలకం. గతంలో 'ఓ బేబీ' వంటి హిట్ ఇచ్చిన ఈ కాంబినేషన్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టైటిల్ కార్డులోనే తన పేరును మార్చుకోవడం ద్వారా, ఆమె తన కొత్త జీవితానికి పూర్తిస్థాయిలో అంకితమైనట్లు సంకేతాలిస్తోంది. రాజ్ నిడిమోరు కేవలం భర్త మాత్రమే కాదు, 'ఫ్యామిలీ మ్యాన్' ద్వారా సమంతకు ప్యాన్ ఇండియా గుర్తింపు తెచ్చిన మెంటర్ కూడా. అందుకే ఈ పేరు మార్పు వెనుక బలమైన అనుబంధం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

పేరు మార్పుపై సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. నెటిజన్లు ప్రధానంగా రెండు వర్గాలుగా విడిపోయారు. సమంత తన వ్యక్తిగత ఆనందాన్ని వెతుక్కుంది. పేరులో ఏముంది? ఆమె ప్రతిభే ఆమెను మళ్ళీ నెంబర్ వన్ చేస్తుందని సామ్ ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. గతంలో పేరు మార్చుకున్నప్పుడు కెరీర్ గ్రాఫ్ ఒకలా ఉంటే, విడాకుల తర్వాత సమంతగా ఆమె విశ్వరూపం చూపించింది. ఇప్పుడు మళ్ళీ ఇంటి పేరు మార్చుకోవడం అవసరమా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

సినిమా రంగంలో సెంటిమెంట్లు చాలా బలంగా ఉంటాయి. పేరు మార్పు కలిసి వస్తుందా లేదా అనేది పక్కన పెడితే, సమంత ఎంచుకునే కథలే ఆమె భవిష్యత్తును నిర్ణయిస్తాయి. రాజ్ నిడిమోరు ప్రొడక్షన్ ,క్రియేటివ్ సపోర్ట్ తో సమంత బాలీవుడ్ , టాలీవుడ్‌లలో మరిన్ని విలక్షణమైన పాత్రలు చేసే అవకాశం ఉంది. సమంత అక్కినేని అయినా, సమంత నిడిమోరు అయినా.. ప్రేక్షకులు కోరుకునేది ఆమెలోని అద్భుతమైన నటనను మాత్రమే. 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే, ఈ పేరు మార్పు ఆమెకు లక్కీ ఛార్మ్‌గా మారిందని అందరూ ఒప్పుకోవాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories