Actress: ఓరి నాయ‌నో.. జయం మూవీలో స‌దా చెల్లి ఇప్పుడెలా ఉందో చూశారా.?

Jayam Child Actress Shwetha Then and Now You Wont Believe Her Transformation
x

Actress: ఓరి నాయ‌నో.. జయం మూవీలో స‌దా చెల్లి ఇప్పుడెలా ఉందో చూశారా.?

Highlights

Actress: ప్ర‌స్తుతం సినిమా రంగంలో టాప్ స్థానానికి చేరుకున్న హీరోహీరోయిన్లలో చాలా మంది తమ ప్రయాణాన్ని చిన్నతనంలో చైల్డ్ ఆర్టిస్టులుగా ప్రారంభించారు.

Actress: ప్ర‌స్తుతం సినిమా రంగంలో టాప్ స్థానానికి చేరుకున్న హీరోహీరోయిన్లలో చాలా మంది తమ ప్రయాణాన్ని చిన్నతనంలో చైల్డ్ ఆర్టిస్టులుగా ప్రారంభించారు. అప్పట్లో అమాయకమైన నటనతో ఆకట్టుకున్న వారు, ఇప్పుడు వెండితెరపై కథానాయకనాయకులుగా మెరిసిపోతున్నారు. మరికొందరు మాత్రం సినిమాలకు గుడ్‌బై చెప్పి తమ, వృత్తుల్లో స్థిర‌ప‌డిపోయారు. ఈ జాబితాలోకి వ‌స్తుంది శ్వేత.

ఈ పేరు కంటే జ‌యం మూవీలో స‌దా చెల్లి అంటే ఇట్టే గుర్తు ప‌డ‌తారు. శ్వేత చిన్ననాటి నుంచే బుల్లితెరపై పాపులర్. పది సీరియల్స్ లో నటించిన ఈమె, సీతామహాలక్ష్మి సీరియల్ చేస్తున్న సమయంలో, ‘జయం’ సినిమాకు ఆడిషన్ నోటీసు వచ్చింది. శ్వేత తండ్రి ఆమె ఫోటోలను దర్శకుడు తేజకు పంపగా, వెంటనే హీరోయిన్ చెల్లిగా ఆమెను ఎంపిక చేశారు. ‘జయం’లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ సినిమాలో ఆమె “అక్షరాలు తిప్పిరాసే అమ్మాయి”గా వేసిన పాత్ర ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. నటనకు నంది అవార్డు కూడా గెలుచుకుంది.

తర్వాత ఉత్సాహం, అనగనగా ఓ కుర్రాడు వంటి సినిమాల్లో కనిపించిన శ్వేత, విద్యపై ఆసక్తితో ఫుల్ల్ టైం చదువులకు మొగ్గు చూపింది. విదేశాల్లో మాస్టర్స్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేసుకుంది. పెళ్లి అనంతరం కుటుంబంతో విదేశాల్లో సెటిలయ్యింది. చ‌దువుకునే స‌మ‌యంలో కొన్ని సినిమా ఆఫ‌ర్లు వ‌చ్చినా శ్వేత వాటికి అంగీక‌రించ‌లేదు.

ప్ర‌స్తుతం సినిమాల‌కు దూరంగా ఉంటున్నా శ్వేత సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలు ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌తో పంచుకుంటోంది. ఇటీవల శ్వేత పోస్ట్ చేసిన కొన్ని పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి. అలా ఉన్న చిన్నారి ఇలా మారిందంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories