NTR : మహేష్ బాబుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్..ఆయనతో సినిమా అంటే ఆటలు కాదు

NTR : మహేష్ బాబుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్..ఆయనతో సినిమా అంటే ఆటలు కాదు
x

NTR : మహేష్ బాబుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్..ఆయనతో సినిమా అంటే ఆటలు కాదు

Highlights

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య మంచి స్నేహం ఉంది.

NTR : టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య మంచి స్నేహం ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే రాజమౌళితో సినిమా చేయడం ఎంత పెద్ద ఛాలెంజ్ అన్న విషయం గురించి ఎన్టీఆర్.. మహేష్ బాబుకు ముందే ఒక వేదికపై సరదాగా హెచ్చరించాడు. రాజమౌళితో కలిసి స్టూడెంట్ నం.1, యమదొంగ, RRR వంటి బ్లాక్‌బస్టర్ సినిమా చేసిన అనుభవం ఉన్న ఎన్టీఆర్ మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని తెలుస్తోంది.

రాజమౌళి పనితీరు గురించి, ఆయన సినిమాల పర్ఫెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి ఏ పని చేసినా, అది పక్కా పర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంటారు. అందుకే ఆయనతో సినిమా చేయాలంటే ఆ హీరోలు మరే ఇతర సినిమాలు ఒప్పుకోకుండా కేవలం ఈ సినిమాపైనే దృష్టి పెట్టాలి. ఈ విషయం గురించి ఎన్టీఆర్ గతంలో ఒక ఈవెంట్‌లో మాట్లాడుతూ.. "రాజమౌళి సినిమా చేస్తున్నావంటే ఆయన నిన్ను అన్ని ఆటలు ఆడిస్తాడు" అని సరదాగా మహేష్ బాబును టీజ్ చేశాడు. ఇది అనుభవంతో చెబుతున్న మాట అని కూడా ఆ సందర్భంగా ఎన్టీఆర్ నవ్వుతూ చెప్పాడు.



ఎన్టీఆర్ చెప్పినట్లుగానే, ఇప్పుడు మహేష్ బాబుకు కూడా రాజమౌళి పర్ఫెక్షనిజం రుచి చూపిస్తున్నాడు. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఒక షూటింగ్ సమయంలో మహేష్ బాబు కాస్త అలసిపోయారట. "నేను సింపుల్‌గా నడుచుకుంటూ వస్తాను, నా స్టైల్‌లో సింపుల్ షర్ట్ వేసుకుని వస్తాను" అని మహేష్ బాబు అడిగినా, రాజమౌళి అందుకు ఒప్పుకోలేదట. మహేష్‌తో ఒక ప్రత్యేకమైన, గ్రాండ్ ఎంట్రీ చేయించాల్సిందేనని పట్టుబట్టారట. అంటే రాజమౌళి విజన్ ప్రకారం అవుట్‌పుట్ పర్ఫెక్ట్‌గా వచ్చేంత వరకు ఆయన రాజీ పడరు. ఈ విషయంలో హీరోలు ఎంత కష్టపడటానికైనా సిద్ధంగా ఉండాలి.

రాజమౌళి పర్ఫెక్షన్ ఎలా ఉంటుందో RRR సినిమాలోని నాటు నాటు పాట షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్, రామ్ చరణ్ అనుభవించారు. ఆ పాట కోసం ఇద్దరు హీరోలు కలిసి ఎన్నో రీటేక్‌లు చేయాల్సి వచ్చింది. ఆ అనుభవాన్ని ఎన్టీఆర్ అనేక సందర్భాలలో పంచుకున్నారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమాల కోసం ఆ లెవల్ త్యాగాలను చేయడానికి సిద్ధంగా ఉన్నారని, పర్ఫెక్ట్ షాట్ వచ్చేంత వరకు విశ్రమించరని అర్థమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories