Juhi Chawla: ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్.. ఈమె ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..?

Juhi Chawla Richest Heroine in India
x

ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్.. ఈమె ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..?

Highlights

ఒకప్పుడు సినీ రంగంలో ఆమె టాప్ హీరోయిన్. ప్రస్తుతం ఇండస్ట్రీలో యాక్టివ్‌గా లేకపోయినా ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌గా నిలిచారు. ఇంతకీ ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటి జూహీ చావ్లా.

Juhi Chawla: ఒకప్పుడు సినీ రంగంలో ఆమె టాప్ హీరోయిన్. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు. అందం, అభినయంతో యూత్‌ను బాగా ఆకట్టుకున్నారు. అందుకే ఆమె రేంజ్‌కు తగ్గట్టుగానే ఒక్కో సినిమాకు భారీ పారితోషికం తీసుకునేవారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో యాక్టివ్‌గా లేకపోయినా ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌గా నిలిచారు. ఇంతకీ ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటి జూహీ చావ్లా.

జూహీ చావ్లాకు అప్పట్లో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉండేది. ఆమె అందానికి అంతా ఫిదా అయ్యేవాళ్లు. ఎంతలా అంటే సల్మాన్ ఖాన్ సైతం ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారంట. ఇదే విషయాన్ని నేరుగా ఆమె ఇంటికి వెళ్లి ఆమె తండ్రికి చెప్పారంట. కానీ అతను అందుకు నిరాకరించారంట. దీంతో వీరి పెళ్లి క్యాన్సిల్ అయింది. కొన్నాళ్ల పాటు సినీ ఇండస్ట్రీని ఏలిన జూహి.. ఇప్పుడు వ్యాపారరంగంలో సత్తా చాటుతున్నారు.

16 ఏళ్ల వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టిన జూహీ చావ్లా.. కెరీర్ తొలినాళ్లలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకున్నారు. కెరీర్‌ మంచి ఫాంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. 1984లో మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న జూహీచావ్లా.. తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 1986లో ధర్మేంద్ర, సన్నీ డియోల్, శ్రీదేవి నటించిన సుల్తానత్ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో నటించారు.

తెలుగులో నాగార్జునతో కలిసి విక్కీదాదా సినిమాలో నటించారు. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మలయాళంలో మమ్ముట్టి, మోహన్‌ లాల్‌తో కలిసి నటించారు. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే జై మెహతా అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న జూహీ చావ్లా.. ప్రస్తుతం వ్యాపారరంగంలో రాణిస్తున్నారు. దీని ద్వారా ఆమె పెద్ద మొత్తంలోనే డబ్బు సంపాదించారు.

నివేదికల ప్రకారం ప్రస్తుతం ఆమె ఆస్తులు రూ.4,600 కోట్లు, ఇండస్ట్రీలో షారూఖ్ ఖాన్ తర్వాత అత్యధిక ఆస్తులు ఉన్న నటిగా జూహీచావ్లా రికార్డ్ సృష్టించారు. అంతేకాదు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌గా నిలిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories