Jyothika: వాటి కంటే కంగువా బెటర్.. సూర్యకు సపోర్ట్‌‌గా జ్యోతిక

Jyothika Shares her Opinion On Surya Kanguva Movie Reviews
x

వాటి కంటే కంగువా బెటర్.. సూర్యకు సపోర్ట్‌‌గా జ్యోతిక

Highlights

సూర్య హీరోగా శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం కంగువా. గతేడాది విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేపోయింది. అయితే ఈ సినిమా పై వచ్చిన విమర్శల మీద తాజాగా సూర్య లైఫ్ నటి జ్యోతిక స్పందించారు.

Jyothika: సూర్య హీరోగా శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం కంగువా. గతేడాది విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేపోయింది. అయితే ఈ సినిమా పై వచ్చిన విమర్శల మీద తాజాగా సూర్య లైఫ్ నటి జ్యోతిక స్పందించారు. ఎన్నో దారుణమైన సినిమాల కంటే కంగువా బెటర్ అని అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.

కంగువా సినిమా పై రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ హిట్ కాదు కదా.. దారుణమైన ట్రోల్స్, విమర్శలకు గురైంది. తాజాగా దీనిపై మాట్లాడిన జ్యోతిక.. దక్షిణాదిలో చాలా చెత్త సినిమాలు కమర్షియల్‌గా విజయం సాధించి వసూళ్లు చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. కానీ తన భర్త చేసిన కంగువా సినిమా విషయంలో సమీక్షలు మరీ దారుణంగా రాశారని అన్నారు.

సినిమా ప్రారంభంలో కొద్దిసేపు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. అలాగే కొన్నిచోట్ల సన్నివేశాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయి ఉండొచ్చు. కానీ అది చేయడానికి టీం ఎంతో కష్టపడింది. కంగువాను వైవిధ్య చిత్రంగా తీర్చిదిద్దిందన్నారు. కానీ ఎన్నో చెత్త సినిమాల కంటే కంగువా బెటర్ అని.. కావాలనే ఈ సినిమాలు టార్గెట్ చేసి విమర్శలు చేశారన్నారు. ప్రస్తుతం జ్యోతిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

జ్యోతిక గతంలో కూడా కంగువా సినిమాపై స్పందించారు. సినిమాలో మొదటి అరగంట వర్క్ అవుట్ కాలేదని.. సౌండ్‌లో కూడా కాస్త సమస్యలు ఉన్నాయని ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశారు. ఇలాంటి లోపాలు భారతీయ సినిమాల్లో తరచూ కనిపిస్తుంటాయన్నారు. ముఖ్యంగా సరికొత్త నేపధ్యంలో సినిమా చేయాలని ప్రయత్నించినప్పుడు ఇలాంటివి జరుగుతాయన్నారు.

ఇదిలా ఉంటే.. జ్యోతిక కోసం ముంబైకి షిఫ్ట్ అయిన సూర్య.. అక్కడి నుంచే తమిళ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం రెట్రో సినిమాలో నటిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మే 1న విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories