శ్రీ లీల విషయంలో కంగారు పడుతున్న కాజల్ ఫ్యాన్స్

Kajal Fans are Worried about Sreeleela
x

శ్రీ లీల విషయంలో కంగారు పడుతున్న కాజల్ ఫ్యాన్స్

Highlights

Sreeleela: కాజల్ అభిమానులకు నిద్ర లేకుండా చేస్తున్న శ్రీ లీల

Sreeleela: "పెళ్లి సందడి" సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన శ్రీ లీలా పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో బాగానే వినిపిస్తోంది. ఈ మధ్యనే "ధమాకా" సినిమాతో కూడా రవితేజ సరసన హీరోయిన్ గా కనిపించిన ఈమె ఈ సినిమాతో కూడా మరొక బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఇప్పుడు నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాలో శ్రీ లీల కూడా కీలక పాత్రలో కనిపించబోతోంది.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల బాలకృష్ణ కూతురిగా కనిపించబోతోంది. అయితే శ్రీ లీలపై రోజురోజుకీ పెరుగుతున్న క్రేజ్ కాజల్ అభిమానులను ఇప్పుడు నిద్రపోనివ్వకుండా చేస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే కాజల్ బాలకృష్ణ మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కాజల్ హీరోయిన్ గా కనిపిస్తోంది. అంటే బాలకృష్ణ భార్య పాత్రలో కాజల్ కనిపించబోతోంది. కాబట్టి శ్రీ లీల కాజల్ కూతురుగా కనిపించనుంది. "ధమాకా" సినిమాలో రవితేజ ను డామినేట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన శ్రీ లీల ఇప్పుడు కాజల్ పక్కన కనిపించటం అభిమానులను కలవరపెడుతోంది.

ఈ మధ్యనే ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ మళ్లీ ఇన్నాళ్లకు వెండితెరపై కనిపించనుంది. ఈ సినిమా కాజల్ కు చాలా కీలకం కాబోతోంది. కానీ ఇలాంటి సమయంలో ఒకవేళ కాజల్ ను శ్రీ లీల ఈ సినిమాలో డామినేట్ చేస్తే కాజల్ కెరీర్ ఏమవుతుందో అని అభిమానులు కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే కాజల్ మాత్రం ఏవేవి పట్టించుకోకుండా బాలకృష్ణ సరసన నటించడానికి ఒప్పుకుని అందరికీ షాక్ ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories