NTRNeel: ఎన్టీఆర్ సినిమాలో కాజోల్ తల్లి పాత్ర?

NTRNeel:  ఎన్టీఆర్ సినిమాలో కాజోల్ తల్లి పాత్ర?
x

NTRNeel: ఎన్టీఆర్ సినిమాలో కాజోల్ తల్లి పాత్ర?

Highlights

NTRNeel: జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం గురించి ఆసక్తికర వార్త వినిపిస్తోంది.

NTRNeel: జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం గురించి ఆసక్తికర వార్త వినిపిస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం. ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో ఆమె ఎన్టీఆర్‌కు తల్లి పాత్రలో కనిపించనున్నారట.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి తాజా లీక్ ఒకటి వినిపిస్తోంది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ ఈ చిత్రంలో నటించనున్నట్టు సమాచారం. ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌లో ఆమె హీరో ఎన్టీఆర్‌కు తల్లి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ వార్తలో నిజానిజాలు ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే అనేక రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యుత్తమ చిత్రంగా తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories