Kama And The Digital Sutras: ట్రైలర్‌తో షాక్ ఇచ్చిన కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్.. కమర్షియల్ హంగులతో సోషల్ మెసేజ్!

Kama And The Digital Sutras: ట్రైలర్‌తో షాక్ ఇచ్చిన కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్.. కమర్షియల్ హంగులతో సోషల్ మెసేజ్!
x
Highlights

Kama And The Digital Sutras: ఎన్.హెచ్. ప్రసాద్ దర్శకత్వంలో, సుమలీల సినిమా బ్యానర్ పై నిర్మించిన "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్" సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో ఘనంగా జరిగింది.

Kama And The Digital Sutras: ఎన్.హెచ్. ప్రసాద్ దర్శకత్వంలో, సుమలీల సినిమా బ్యానర్ పై నిర్మించిన "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్" సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో ఘనంగా జరిగింది. అన్ని కమర్షియల్ అంశాలతో పాటు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలు, సోషల్ ఇష్యూస్ (సామాజిక సమస్యలు) నేపథ్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా ఈ నెల 12న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

దర్శక నిర్మాత ఎన్.హెచ్. ప్రసాద్ మాట్లాడుతూ.. తన సినిమా బడ్జెట్ పరంగా చిన్నదైనా, క్వాలిటీలో ఎక్కడా రాజీ పడలేదన్నారు. శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా, అసభ్యత లేకుండా 'క్లీన్'గా, పొయెటిక్ (కవిత్వభరితంగా) రూపొందించినట్లు తెలిపారు.

నటి చంద్రకళా మాట్లాడుతూ, సినిమా స్క్రిప్ట్ చదివినప్పుడు భయపడినా, ఛాలెంజింగ్‌గా తీసుకుని నటించానని, ఇందులో సొసైటీలో చూసే సోషల్ ఇష్యూస్ ఉంటాయని చెప్పారు. నటుడు దినేష్ ఇది తనకు గుర్తింపు తెచ్చే సినిమా అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

నిర్మాత/డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ.. కుటుంబాల్లో దాగి ఉండే సమస్యలను, మృగాళ్లను గుర్తించలేకపోతున్నామనే ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందిందని, మంచి సందేశం, వినోదం ఉన్న ఈ చిత్రాన్ని విస్తృతంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

డీవోపీ శివశంకర వరప్రసాద్, దర్శకుడి డెడికేషన్‌తో మంచి విజువల్ క్వాలిటీతో సినిమా చేశామన్నారు. ఈ సినిమా సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తూనే, ప్రేక్షకులను మెప్పిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories