Kangana Ranaut : నేను షారుఖ్ ఖాన్ కంటే బెటర్.. కంగనా రనౌత్ షాకింగ్ స్టేట్‎మెంట్

Kangana Ranaut  : నేను షారుఖ్ ఖాన్ కంటే బెటర్..  కంగనా రనౌత్ షాకింగ్ స్టేట్‎మెంట్
x

 Kangana Ranaut : నేను షారుఖ్ ఖాన్ కంటే బెటర్.. కంగనా రనౌత్ షాకింగ్ స్టేట్‎మెంట్

Highlights

బాలీవుడ్‌ నటి, ప్రస్తుతం బీజేపీ ఎంపీ అయిన కంగనా రనౌత్ మరోసారి హాట్‌టాపిక్‌గా మారారు. ఆమె నటిగా అద్భుతమైన ప్రతిభ కనబరిచినప్పటికీ, ఆమె చేసే వ్యాఖ్యలు తరచుగా వివాదాస్పదమవుతాయి.

Kangana Ranaut : బాలీవుడ్‌ నటి, ప్రస్తుతం బీజేపీ ఎంపీ అయిన కంగనా రనౌత్ మరోసారి హాట్‌టాపిక్‌గా మారారు. ఆమె నటిగా అద్భుతమైన ప్రతిభ కనబరిచినప్పటికీ, ఆమె చేసే వ్యాఖ్యలు తరచుగా వివాదాస్పదమవుతాయి. గతంలో ఒక ప్రచార సభలో మాట్లాడుతూ.. "బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ తర్వాత అంత గౌరవం దక్కింది నాకే" అని చెప్పి ట్రోలింగ్‌కు గురయ్యారు. తాజాగా కంగనా తనను తాను షారుఖ్ ఖాన్తో పోల్చుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి.

ఒక కార్యక్రమంలో పాల్గొన్న కంగనా రనౌత్, తనను తాను బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్‌తో పోల్చుకున్నారు. "నేను ఇంత పెద్ద విజయాన్ని ఎలా సాధించానో ఆలోచించండి. ఒక చిన్న గ్రామం నుండి వచ్చి ఇంత గొప్ప విజయాన్ని సాధించిన వారు బాలీవుడ్‌లో ఎవరూ లేరు. షారుఖ్ ఖాన్ ఢిల్లీ నుంచి వచ్చినప్పటికీ, ఆయన కాన్వెంట్ విద్యను అభ్యసించారు. కానీ నేను గ్రామం నుంచి వచ్చిన దాన్ని. నా గ్రామం పేరు కూడా చాలా మందికి తెలియదు" అని కంగనా వ్యాఖ్యానించారు.

"హిమాచల్ ప్రదేశ్‌లోని బామ్లా అనే చిన్న గ్రామం నుంచి వచ్చి నేను ఇంత పెద్ద విజయాన్ని, ఇంత పెద్ద స్థానాన్ని సంపాదించుకున్నాను. అందుకే బహుశా కొంతమంది నా మాటలను అంగీకరించలేకపోవచ్చు. కానీ నా మాటలు ఎప్పుడూ చాలా నిజాయితీగా ఉంటాయి. నేను చాలా నిజాయితీగా సమాధానం ఇస్తాను. నా గురించి కూడా నేను చాలా నిజాయితీగా ఉంటాను" అని కంగనా రనౌత్ అన్నారు. నటిని కావాలని టీనేజ్ లోనే ఇంటిని వదిలి ముంబైకి వచ్చి, అనేక కష్టాలను ఎదుర్కొని ఆమె విజయం సాధించారు.

కంగనా హిమాచల్ ప్రదేశ్‌లోని బామ్లా అనే చిన్న పట్టణానికి చెందినవారు. ఆమె తండ్రి వ్యాపారవేత్త, తల్లి ఉపాధ్యాయురాలు. ఆమె తాత ఐఏఎస్ అధికారి కాగా, ముత్తాత ఎమ్మెల్యేగా పనిచేశారు. వారి కుటుంబం జమీందారీ నేపథ్యం కలిగినది. బామ్లాలో హవేలి (పెద్ద ఇల్లు)లో నివసించేవారు.

షారుఖ్ ఖాన్ ఢిల్లీకి చెందినవారు. ఆయన తాత ప్రభుత్వ ఇంజనీర్, కర్ణాటకలో కూడా పనిచేశారు. షారుఖ్ తండ్రికి హోటల్ వ్యాపారం ఉండేది, అంతకుముందు ఢిల్లీలోని ఎన్ఎస్‌డీ (నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా) క్యాంటీన్‌లో పని చేసేవారు. అయితే, షారుఖ్ తండ్రి 1981లోనే మరణించారు. షారుఖ్ 1991లో సీరియల్స్‌లో నటుడిగా ప్రారంభమై, ఆ తర్వాత చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ఆయన భారతదేశంలోనే కాక, ఆసియాలోనే నంబర్ 1 స్టార్‌గా వెలుగొందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories