Kannappa: ఇదేం ట్విస్ట్..సినిమా హార్డ్ డ్రైవ్‌తో పరారైన ఇద్దరు

kannappa  hard drive missed telugu news
x

 Kannappa: ఇదేం ట్విస్ట్..సినిమా హార్డ్ డ్రైవ్‌తో పరారైన ఇద్దరు

Highlights

Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్పకు ఊహించని సమస్యలు వస్తున్నాయి. సినిమాను ఎప్పుడో విడుదల చేయాలనుకున్నా కుదురక జూన్ 27న ప్రేక్షకుల...

Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్పకు ఊహించని సమస్యలు వస్తున్నాయి. సినిమాను ఎప్పుడో విడుదల చేయాలనుకున్నా కుదురక జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్లాన్ చేస్తున్నారు. మూవీలో అన్ని ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ ఉండటంతో ఈ మూవీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. విష్ణు మంచుతోపాటు ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్, శరత్ కుమార్, మధుబాల, ముఖేష్ రిషి, విష్ణు కూతుళ్ల, రఘుబాబు, సప్తగిరి ఇలా చాలా మంది స్టార్స్ ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. తెలుగువారితోపాటు మలయాళం, హిందీ, కన్నడ, తమిళ్ ఇలా పలు ప్రాంతీయభాషల్లో కన్నప్ప మూవీని భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమా హార్డ్ డ్రైవ్ మిస్సయ్యింది. కన్నప్ప మూవీకి సంబంధించి విలువైన సమాచారంతో కూడిన హార్డ్ డ్రైవ్ మాయమైనట్లు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు అయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కోకాపేటకు చెందిన రెడ్డి విజయ్ కుమార్ ట్వంటిఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. అయితే కన్నప్ప మూవీ కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ ను ముంబైలోని హెచ్ఐవీఈస్టూడియోస్ ఇటీవల కొరియర్ ద్వారా ఫిలింనగర్ లోని విజయ్ కుమార్ కార్యాలయానికి పంపించింది. ఈ నెల 25వ తేదీన ఆ కొరియర్ పార్షిల్ ను కార్యాలయంలో పనిచేసే ఆఫీస్ బాయ్ తీసుకున్నాడు.

కొరియర్ వచ్చిందన్న సంగతి అతను ఎవరికి చెప్పకుండా చరిత అనే మహిళకు ఇచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత నుంచి ఇద్దరూ కనిపించకుండా పోయారు. అయితే తమ సినిమా ప్రాజెక్టుకు నష్టం కలిగించాలన్న ఉద్దేశ్యంతోనే గుర్తుతెలియని వ్యక్తుల మార్గనిర్దేశంలో రఘు చరిత ఈ కుట్రకు పాల్పడ్డారని విజయ్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories