Kannappa Song: కన్నప్ప నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

Kannappa Love Song Released
x

కన్నప్ప నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

Highlights

కన్నప్ప సినిమా నుంచి మేకర్స్ లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఫుల్ రొమాంటిక్ సీన్లతో సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటుంది. ఈ రొమాంటిక్ సాంగ్‌ను ప్రభుదేవా కొరియోగ్రాఫీ చేశారు.

Kannappa Song: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. మంచు విష్ణు తిన్నడుగా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మేకర్స్ లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఫుల్ రొమాంటిక్ సీన్లతో సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటుంది.

ఈ రొమాంటిక్ సాంగ్‌ను ప్రభుదేవా కొరియోగ్రాఫీ చేశారు. స్టీఫెన్ దేవస్సి సంగీతం దర్శకత్వంలో శ్రీమణి రాసిన ఈ పాటను రేవంత్, సాహితీ పాడారు. మంచు విష్ణు, ప్రీతి ముకుందన్ మధ్య రొమాంటిక్‌గా సాగిన ఈ సాంగ్‌ను న్యూజిలాండ్‌ అడవుల్లో తెరకెక్కించారు.

ఈ మూవీని దర్శకుడు ముఖేష్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ముఖ్యంగా గ్రాఫిక్స్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో పలువురు స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మోహన్ బాబు ఫ్యామిలీకి చెందిన మూడు తరాల వారు కనిపించబోతున్నారు. మోహన్ బాబు, మంచు విష్ణు, అతడి కుమారుడు నటిస్తున్నారు. భారీ హైప్‌తో రాబోతున్న ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories