Kannappa: భక్తి సినిమాలో గ్లామర్‌ ఎందుకు.? మంచు విష్ణు ఏమన్నారంటే..

Kannappa: Manchu Vishnu Reacts to Glamour in a Devotional Film
x

Kannappa: భక్తి సినిమాలో గ్లామర్‌ ఎందుకు.? మంచు విష్ణు ఏమన్నారంటే..

Highlights

Kannappa: హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు.

Kannappa: హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అగ్ర కథానాయకులు నటిస్తున్నారు. కాగా ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్‌ బజ్‌ ఏర్పడింది. సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్లు, పాటలు మూవీపై అంచనాలను పెంచేసింది. కాగా ఈ సినిమాలో గ్లామర్‌ పాటలపై కొంత నెట్టింట నెగిటివ్‌ కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే సినిమాలోని లవ్‌ సాంగ్‌పై హీరో విష్ణు స్పందించారు. భక్తి నేపథ్యంలో సినిమా తీస్తే అందులో ప్రేమ పాటలు అవసరమా? అనే ప్రశ్నపై మంచు విష్ణు స్పందిస్తూ, "భక్త కన్నప్ప’ సినిమాలో కూడా అద్భుతమైన ప్రేమ పాటలు ఉన్నాయి. రెండో శతాబ్దంలో దుస్తుల రూపం ఎలా ఉండేదీ పరిశీలించాలి. విమర్శించాలనే ఉద్దేశంతో కొందరు సినిమా పట్ల నెగటివ్‌గా చూస్తున్నారు. గతంలో శివుడి పాటలపై కూడా విమర్శలు వచ్చాయి. వాటిని చూసి నేను కేవలం నవ్వుకున్నా. ఈ సినిమా డాక్యుమెంటరీ కాదు, అందుకే కమర్షియల్ అంశాలు కూడా కలపాల్సి ఉంటుంది అని స్పష్టం చేశారు.

ఓటీటీ హక్కుల గురించి ఏమన్నారు?

ఈ సినిమా ఓటీటీ హక్కుల గురించి మాట్లాడుతూ, "నేను పెట్టిన భారీ బడ్జెట్‌ను ఓటీటీకి అమ్మితే, అది నాకు లాభదాయకం కాదు. అందుకే ఓటీటీ సంస్థలకు ఇప్పటివరకు నా సినిమాను చూపించలేదు. మా మార్కెటింగ్ టెక్నిక్స్ మా దగ్గర ఉన్నాయి. ‘కన్నప్ప’ నా కెరీర్‌లోనే అత్యంత పెద్ద రిస్క్. కానీ శివుడే నా ప్రాజెక్ట్‌ను కాపాడతాడనే నమ్మకం ఉంది" అని విశ్వాసం వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి ఎందుకు వెళ్లలేదు?

గతేడాది డిసెంబర్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపరిశ్రమ ప్రముఖులతో భేటీ అయినప్పటికీ, తాను హాజరుకాలేకపోయిన విషయాన్ని మంచు విష్ణు గుర్తుచేశారు. "ఆ సమయంలో మా ఫ్యామిలీ ఈవెంట్ కారణంగా సమావేశానికి వెళ్లలేకపోయాను. ఏ ప్రభుత్వమూ చిత్ర పరిశ్రమకు వ్యతిరేకంగా ఉండదని నా అభిప్రాయం" అని అన్నారు. మరి భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories