Kantara Chapter 1 OTT Release: ఓటీటీలోకి ‘కాంతార చాప్టర్‌ 1’.. స్ట్రీమింగ్‌ డేట్ ఫిక్స్‌!

Kantara Chapter 1 OTT Release: ఓటీటీలోకి ‘కాంతార చాప్టర్‌ 1’.. స్ట్రీమింగ్‌ డేట్ ఫిక్స్‌!
x

Kantara Chapter 1 OTT Release: ఓటీటీలోకి ‘కాంతార చాప్టర్‌ 1’.. స్ట్రీమింగ్‌ డేట్ ఫిక్స్‌!

Highlights

బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ‘కాంతార చాప్టర్‌ 1’ (Kantara Chapter 1) ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ‘కాంతార చాప్టర్‌ 1’ (Kantara Chapter 1) ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల అక్టోబర్‌ 31 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని ప్రైమ్‌ వీడియో సంస్థ అధికారికంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది.

‘కాంతార’కు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో భారీ విజయం సాధించింది. రిషబ్‌ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియడిక్ యాక్షన్‌ డ్రామాలో ఆయన ప్రధాన పాత్రలో నటించగా, రుక్మిణీ వసంత్‌, గుల్షన్‌ దేవయ్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. అక్టోబర్‌ 2న విడుదలైన ఈ సినిమా రూ.800 కోట్లకు పైగా వసూలు చేసి, అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో 13వ స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం ఇంగ్లీష్‌ వెర్షన్‌లో కూడా అదే రోజు స్ట్రీమింగ్‌ కానుంది.

8వ శతాబ్దం నాటి కదంబ రాజవంశం నేపథ్యంగా ఈ కథ సాగుతుంది. కాంతార అనే దైవిక భూమిలో దేవుడి పూదోట, మర్మమైన బావి చుట్టూ తిరిగే ఈ కథలో, రిషబ్‌ శెట్టి పోషించిన ‘బెర్మే’ పాత్ర కీలకంగా నిలుస్తుంది. ఆధ్యాత్మికత, మానవ ఆశలు, దుష్టశక్తులతో పోరాటం — ఈ అంశాలను సమన్వయం చేస్తూ చిత్రాన్ని రూపొందించారు.

ఓటీటీలో మళ్లీ కాంతార మాయ కోసం సిద్ధం అవ్వండి — అక్టోబర్‌ 31 నుంచి ప్రైమ్‌లో!

Show Full Article
Print Article
Next Story
More Stories