Keerthy Suresh: కీర్తి సురేశ్ వివరణ చిరంజీవి అభిమానులకు క్షమాపణ చెప్పిన స్టార్ హీరోయిన్

Keerthy Suresh: కీర్తి సురేశ్ వివరణ చిరంజీవి అభిమానులకు క్షమాపణ చెప్పిన స్టార్ హీరోయిన్
x

Keerthy Suresh: కీర్తి సురేశ్ వివరణ చిరంజీవి అభిమానులకు క్షమాపణ చెప్పిన స్టార్ హీరోయిన్

Highlights

కీర్తి సురేశ్ ఇటీవల చిరంజీవి డాన్స్‌ గురించి చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు వచ్చాయి. కొంతకాలం క్రితం ఓ రాపిడ్‌ ఫైర్ ఇంటర్వ్యూలో చిరంజీవి కంటే విజయ్ బెస్ట్ డాన్సర్ అని చెప్పడం మెగా అభిమానులను తీవ్రంగా కోపగించగా, ఆ వీడియో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కీర్తి సురేశ్ ఇటీవల చిరంజీవి డాన్స్‌ గురించి చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు వచ్చాయి. కొంతకాలం క్రితం ఓ రాపిడ్‌ ఫైర్ ఇంటర్వ్యూలో చిరంజీవి కంటే విజయ్ బెస్ట్ డాన్సర్ అని చెప్పడం మెగా అభిమానులను తీవ్రంగా కోపగించగా, ఆ వీడియో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే నేపథ్యంలో, త్వరలో విడుదలకానున్న ‘రివాల్వర్ రీటా’ ప్రమోషన్ల కోసం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన కీర్తి ఈ వ్యాఖ్యపై వివరణ ఇచ్చారు.

ఆమె మాట్లాడుతూ

“హీరో విజయ్‌ను నేను ఎంతగా అభిమానిస్తానో చిరంజీవి గారికి కూడా తెలుసు. చిరంజీవి సర్ నా ఫేవరెట్ హీరో. ‘భోళా శంకర్’ షూటింగ్ సమయంలో ఆయనతో ఎంతగా సరదాగా మాట్లాడుకున్నామో చెప్పలేను. ‘ఏ హీరో డాన్స్ ఇష్టం? ఎవరి నటన అంటే ఇష్టం?’ అని సెట్స్‌లో సరదాగా అడిగేవారు. అప్పుడు కూడా విజయ్ డాన్స్ నచ్చుతుంది, సూర్య నటన అంటే ఇష్టం అని చెప్పాను. మా మధ్య జరిగినవి అన్నీ ఫ్రెండ్లీ చిట్‌చాట్లే. ఎవ్వరినీ ఎక్కువ, తక్కువగా చూడను. భారతదేశంలో ఉన్న గొప్ప నటుల్లో చిరంజీవి గారు ఒకరు. ఆయనే మెగాస్టార్, లెజెండ్. మా కుటుంబం మొత్తం ఆయనకు గౌరవం ఇస్తుంది. ఒకవేళ నా మాటలు అభిమానులను బాధపెట్టినట్లయితే హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నా” అని స్పష్టం చేశారు.

నటిగా తన ప్రయాణం గురించి మాట్లాడుతూ

“ఎప్పుడూ కొత్త పాత్రల కోసం వెతుకుతూనే ఉంటా. ఇప్పటివరకు ఎన్నో ప్రయోగాలు చేసినా, నా యాక్టింగ్ జర్నీ ఇప్పుడే మొదలైనట్లు అనిపిస్తుంది. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నన్ను నేను మరింతగా నిరూపించుకోవాలి అనిపిస్తుంది. అయితే, ప్రస్తుతం నా జర్నీతో చాలా హ్యాపీగా ఉన్నా” అని అన్నారు.

అలాగే, వేణు ఎల్దండి తెరకెక్కించనున్న ‘ఎల్లమ్మ’ చిత్రంలో తాను నటించడం లేదని కూడా స్పష్టంగా వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories