నటి రేప్ కేసు – హీరో దిలీప్‌కు ఎనిమిదేళ్ల తర్వాత భారీ ఉపశమనం

నటి రేప్ కేసు – హీరో దిలీప్‌కు ఎనిమిదేళ్ల తర్వాత భారీ ఉపశమనం
x

నటి రేప్ కేసు – హీరో దిలీప్‌కు ఎనిమిదేళ్ల తర్వాత భారీ ఉపశమనం

Highlights

కేరళను కుదిపేసిన నటి కిడ్నాప్–లైంగిక దాడి కేసులో ఎనిమిదేళ్ల తర్వాత కీలక మలుపు వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న మలయాళ హీరో దిలీప్‌ను ఎర్నాకులం కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

కేరళను కుదిపేసిన నటి కిడ్నాప్–లైంగిక దాడి కేసులో ఎనిమిదేళ్ల తర్వాత కీలక మలుపు వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న మలయాళ హీరో దిలీప్‌ను ఎర్నాకులం కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

తీర్పు వినగానే దిలీప్ కోర్ట్‌లోనే భావోద్వేగానికి లోనయ్యాడు. తరువాత మీడియాతో మాట్లాడుతూ, “ఇది నా మీద చేసిన కుట్ర. నా కోసం పోరాడిన లాయర్లకు, నన్ను నమ్మి నిలిచిన అందరికీ ధన్యవాదాలు” అని అన్నారు. ప్రాసిక్యూషన్ దిలీప్ ప్రమేయాన్ని నిరూపించడంలో విఫలమైంది.

అయితే అసలు నేరం చేసిన పల్సర్ సునీ గ్యాంగ్ మాత్రం దోషులుగా తేలింది. సునీతో కలిసి మరో ఐదుగురిని కోర్టు దోషులుగా నిర్ణయించింది. కిడ్నాప్, లైంగిక దాడి సంబంధిత సెక్షన్ల కింద వీరికి శిక్షలు విధించనున్నారు. జైలు శిక్ష ఎంతన్నది డిసెంబర్ 12న ప్రకటించనున్నారు. దిలీప్‌తో పాటు ముగ్గురిని కూడా సాక్ష్యాల లేమితో కోర్టు విడిపించింది.

2017 ఫిబ్రవరిలో బాధిత నటి కారులో ప్రయాణిస్తుండగా కిడ్నాప్ చేసి, రెండు గంటల పాటు చిత్రహింసలు పెట్టిన ఘటన ఈ కేసుకు కేంద్రబిందువైంది. ఈ దాడికి దిలీప్‌నే సూత్రధారిగా పోలీసులు ఇన్నాళ్లు వాదించారు. కానీ కోర్టులో అది రుజువుకాలేదు. ఎనిమిదేళ్ల న్యాయ పోరాటం తర్వాత చివరకు తీర్పు వెలువడింది.

ఈ కేసు ఇంతకాలం సాగడానికి, అలాగే ఇప్పుడు దిలీప్ బయటపడటానికి సాక్షుల మార్పునే ప్రధాన కారణంగా చెబుతున్నారు. మొత్తం 261 మంది సాక్షులను విచారించగా, సినీ ప్రముఖులు సహా 28 మంది కీలక సాక్షులు తన మాట మార్చారు. దీంతో ప్రాసిక్యూషన్ కేసు బలహీనపడింది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో దిలీప్‌పై కుట్ర ఆరోపణలు నిలబెట్టలేకపోయింది.

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను అమాయకుడినేనని చెబుతూ వచ్చిన దిలీప్‌కి, కోర్టు తీర్పుతో చివరకు న్యాయం దక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories