Shah Rukh Khan : భారత్‌లో అత్యంత ఖరీదైన యాక్షన్ చిత్రం.. కింగ్ షారుఖ్ ఖాన్ సినిమాకు రికార్డు బడ్జెట్

Shah Rukh Khan
x

Shah Rukh Khan : భారత్‌లో అత్యంత ఖరీదైన యాక్షన్ చిత్రం.. కింగ్ షారుఖ్ ఖాన్ సినిమాకు రికార్డు బడ్జెట్

Highlights

Shah Rukh Khan : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ త్వరలో ఓ భారీ చిత్రంతో రాబోతున్నారు. ఈసారి కూడా ఆయన గత బ్లాక్‌బస్టర్‌ల మాదిరిగానే అంచనాలు భారీగా ఉన్నాయి.

Shah Rukh Khan: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ త్వరలో ఓ భారీ చిత్రంతో రాబోతున్నారు. ఈసారి కూడా ఆయన గత బ్లాక్‌బస్టర్‌ల మాదిరిగానే అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈసారి రెండు బ్లాక్‌బస్టర్లు, ఒక హిట్‎తో షారుఖ్ తిరిగి వస్తున్నాడనేది ప్రత్యేకత. షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా కింగ్ సినిమా ఫస్ట్ లు రిలీజ్ అయింది. ఇది అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఆయన కుమార్తె సుహానా ఎలా కనిపించనుందనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే మొదట షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో కేవలం అతిథి పాత్రలో మాత్రమే నటించాలని అనుకున్నారు. కానీ కథలో మార్పులు జరిగి, చివరికి ఆయన లీడ్ రోల్‎లోకి వచ్చారు. ఈ సినిమా రోజురోజుకూ మరింత పెద్దదిగా, మెరుగైనదిగా మారుతోంది. అందుకే సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని భారత సినిమా చరిత్రలోనే అతిపెద్ద యాక్షన్ చిత్రంగా పరిగణిస్తున్నారు. సినిమా బడ్జెట్, 6 అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌ల వివరాలు తెలుసుకుందాం.

కింగ్ సినిమా ప్రారంభమైనప్పుడు, షారుఖ్ ఖాన్ అతిధి పాత్రతో సుజోయ్ ఘోష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నారు. ఆ సమయంలో సినిమా బడ్జెట్ కేవలం రూ.150 కోట్లు మాత్రమే. కానీ స్క్రిప్ట్‌ను మరింత పెద్దదిగా, మెరుగైనదిగా మార్చడానికి అవకాశం ఉంది. ఈ క్రమంలో సుజోయ్ ఘోష్ ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగగా, షారుఖ్ ఖాన్ సిద్ధార్థ్ ఆనంద్‌తో కలిసి సినిమాను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్‌లను డిజైన్ చేశారు. అంతేకాదు షారుఖ్ ఒక నిర్మాతగా ప్రేక్షకుల కోసం అద్భుతమైన సన్నివేశాలతో వినోదాన్ని పంచడానికి ఇష్టపడతారు.

షారుఖ్ ఖాన్ సిద్ధార్థ్ ఆనంద్‌కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. దీని కారణంగా సినిమా బడ్జెట్ రూ.150 కోట్ల నుంచి ఏకంగా రూ.350 కోట్లకు చేరింది. సిద్ధార్థ్ ఆనంద్‌కు సినిమా పట్ల ఉన్న విజన్ షారుఖ్ ఖాన్‌కు చాలా నచ్చిందని తెలుస్తోంది. కింగ్ భారతదేశంలో నిర్మించినప్పటికీ, ఇది ఒక గ్లోబల్ సినిమా. పశ్చిమ దేశాల్లో లక్షల డాలర్లు ఖర్చయ్యే సినిమాను, సిద్ధార్థ్ ఆనంద్ అందులో ఐదవ వంతు ఖర్చుతో పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో 6 అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయని, వాటిని చాలా అద్భుతంగా డిజైన్ చేశారని తెలుస్తోంది.

షారుఖ్ ఖాన్ సినిమా మొత్తంలో హైలైట్ ఈ 6 యాక్షన్ సీక్వెన్స్‌లపైనే ఉంటుంది. వీటిలో మూడు అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించగా, మిగిలిన మూడు సెట్స్‌పై చిత్రీకరించనున్నారు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ ఎంట్రీ సీన్ పై భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేశారు. ఇది సినిమాకు హైలైట్‌గా పరిగణిస్తున్నారు. దీనిని చూసిన తర్వాత ప్రేక్షకులు అబ్బురపడతారని అంచనా. ఈ సినిమాను 2026 సంవత్సరంలో విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories