K Ramp Review: కిరణ్ అబ్బవరం ‘కే ర్యాంప్’ ఎలా ఉంది? నవ్వించాడు, కానీ లాజిక్ ఉందా?

K Ramp Review
x

K Ramp Review: కిరణ్ అబ్బవరం ‘కే ర్యాంప్’ ఎలా ఉంది? నవ్వించాడు, కానీ లాజిక్ ఉందా?

Highlights

K Ramp Review: ‘క’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం తాజాగా ‘కే ర్యాంప్’ చిత్రంతో అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

తారాగణం: కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, సాయికుమార్, నరేష్, మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్, అలీ. దర్శకత్వం: జైన్స్ నాని నిర్మాత: రాజేష్ దండ

సినిమా కథేంటి?

‘క’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం తాజాగా ‘కే ర్యాంప్’ చిత్రంతో అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కథ విషయానికొస్తే.. చదువుల్లో వెనుకబడిన కుమార్‌ అబ్బవరం (కిరణ్ అబ్బవరం) తండ్రి (సాయికుమార్) డొనేషన్ కట్టి కేరళలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేస్తాడు. అక్కడ మెర్సీ జాయ్ (యుక్తి తరేజా) అనే అమ్మాయి అతన్ని ప్రమాదం నుంచి కాపాడటంతో, ఆమెతో ప్రేమలో పడతాడు. మొదట నిరాకరించినా, ఆ తర్వాత మెర్సీ కూడా కుమార్‌ను ప్రేమిస్తుంది. అయితే, మెర్సీకి ఒక మానసిక రుగ్మత ఉందనే నిజం హీరోకు తెలుస్తుంది. ఆ రుగ్మత కారణంగా కుమార్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? చివరికి ఆ రుగ్మతను హీరో ఎలా మాన్పించాడు? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ: కామెడీ పండిందా?

ఈ సినిమా టీమ్ ముందే ప్రకటించినట్టుగా, ఇది కేవలం నవ్వుకునేందుకు చేసిన చిత్రం. ఇందులో లాజిక్‌లు వెతకకూడదు. డబ్బున్న తండ్రి కారణంగా దారి తప్పిన కొడుకు, ఏదో ఒక అవలక్షణం/రుగ్మత చుట్టూ తిరిగే తెలుగు ఫార్మాట్‌లో కథను రాసుకున్నారు. గతంలో నాని ‘భలే భలే మగాడివోయ్’ (మతిమరుపు), శర్వానంద్ ‘మహానుభావుడు’ (అతి శుభ్రత) వంటి సినిమాలు ఇదే ఫార్మాట్‌లో వచ్చాయి. ఆ కోవలోనే తల్లిదండ్రుల కారణంగా రుగ్మతకు లోనైన హీరోయిన్‌ను, హీరో తన మానసిక పరివర్తన ద్వారా ఎలా మామూలు మనిషిగా చేశాడు అనే రొటీన్ లైన్‌తో దర్శకుడు జైన్స్ నాని కథను నడిపించాడు.

సినిమా మొదలైన 15 నిమిషాలకు కథ కేరళ ఇంజనీరింగ్ కాలేజీకి షిఫ్ట్ అవుతుంది. హీరో-హీరోయిన్ ప్రేమలో పడే సన్నివేశాలు బాగున్నా, రుగ్మత బయటపడిన తరువాత వచ్చే కామెడీ ట్రాక్ సినిమాకు ప్రధాన బలం. హీరోయిన్ రుగ్మత వల్ల హీరో పడే పాట్లు కొన్నిచోట్ల కడుపుబ్బా నవ్వించేలా రాసుకున్నారు. అయితే, సినిమా మొత్తాన్ని ఒక లాజిక్‌లెస్ కామెడీ డ్రామాగానే తీర్చిదిద్దారు. కేవలం సిట్యువేషనల్ కామెడీకి ప్రాధాన్యత ఇచ్చారు. కొన్ని సీన్స్ బాగా పండినా, ఫుల్ లెంగ్త్ సినిమాగా చూస్తే లాజిక్ లోపించింది అని చెప్పొచ్చు.

నటీనటుల ప్రతిభ

కిరణ్ అబ్బవరం: తనకు అలవాటైన 'రిచెస్ట్ చిల్లర ఫెలో', ఇంజనీరింగ్ స్టూడెంట్ పాత్రలో ఆకట్టుకున్నాడు. తన స్టైల్ వన్ లైనర్ డైలాగ్‌లు బాగా వర్కౌట్ అయ్యాయి.

సాయికుమార్ & నరేష్: సాయికుమార్ పాత్ర పరిమితమైనా కీలకమైనది. నరేష్ కనిపించినంత సేపు నవ్వులు పూయించాడు.

యుక్తి తరేజా: నటనకు స్కోప్ ఉన్న పాత్ర దొరికినా, దాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయారేమో అనిపించింది.

కామెడీ గ్యాంగ్: మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్, అలీ, శ్రీనివాసరెడ్డి వంటి హాస్యనటులు కనిపించినప్పుడల్లా నవ్వించే ప్రయత్నం చేశారు.

సాంకేతిక వర్గం

సాంకేతిక బృందం సినిమాను కామెడీ ప్రధానంగానే నడిపించింది. వన్ లైనర్స్ బాగానే రాసుకున్నారు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా ఉంది. అయితే, ఎడిటింగ్ విషయంలో మరింత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.

రేటింగ్: 3/5

Show Full Article
Print Article
Next Story
More Stories