తండ్రి కాబోతున్న హీరో కిరణ్ అబ్బవరం.. సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసిన హీరో

తండ్రి కాబోతున్న హీరో కిరణ్ అబ్బవరం.. సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసిన హీరో
x
Highlights

తెలుగు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నటి రహస్య దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ మేరకు తన భార్య రహస్య గోరక్ బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో...

తెలుగు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నటి రహస్య దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ మేరకు తన భార్య రహస్య గోరక్ బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు కిరణ్. తమ ప్రేమ రెండు అడుగులు ముందుకు పడింది అంటూ తన సతీమణితో దిగిన ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు కిరణ్ అబ్బవరం దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

రాజావారు రాణిగారు సినిమాతో హీరోహీరోయిన్లుగా పరిచయమైన కిరణ్-రహస్య తర్వాత స్నేహితులుగా మారారు. కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 2024 ఆగష్టులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కర్ణాటక కూర్గ్ లోని ఓ రిసార్ట్ లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ప్రేమ వివాహమే అయినప్పటికీ పెద్దలను ఒప్పించి ఇరువురి కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మధ్య ఒక్కటయ్యారు.

ఇక సినిమాల విషయానికొస్తే కిరణ్ అబ్బవరం క అనే సినిమాతో మంచి విజయం అందుకున్నారు. ఈ చిత్రాన్ని అతనే సొంతంగా నిర్మించారు. ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్ని రహస్య దగ్గరుండి చూసుకున్నారు. క తర్వాత దిల్‌రూబా అనే చిత్రంలో కిరణ్ నటిస్తున్నారు. రుక్సర్ థిల్లన్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ మూవీతో విశ్వకరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయని మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories