Junior: హీరోగా ఎంట్రీ ఇస్తున్న గాలి జనార్థన్‌రెడ్డి తనయుడు...

Kireeti Reddy Sreeleela Vaaraahi Chalana Chitram Radha Krishnas Junior Pan India Release On July 18th
x

Junior: హీరోగా ఎంట్రీ ఇస్తున్న గాలి జనార్థన్‌రెడ్డి తనయుడు...

Highlights

హీరోగా ఎంట్రీ ఇస్తోన్న గాలి జనార్థన్‌రెడ్డి కొడుకు

Junior: ప్రముఖ పారిశ్రామికవేత్త, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి (Gaali Janardhan Reddy) ప్రస్తుతం ఓబుళాపురం మైనింగ్ కేసు (Obulapuram Mining Case) లో సీబీఐ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను చంచల్‌గూడ జైలులో అనుభవిస్తున్నారు. తాజాగా, జైలులో తనకు మరిన్ని వసతులు కల్పించాలని కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఈ పిటిషన్ విచారణలో ఉంది.

ఇదిలా ఉంటే గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి (Kiriti) ను హీరోగా పరిచయం చేస్తూ ‘జూనియర్’ (Junior) అనే సినిమా రూపొందుతోంది. 2022లో ప్రారంభమైన ఈ సినిమాకు రాధాకృష్ణ (Radha Krishna) దర్శకత్వం వహించగా, సాయి కొర్రపాటి (Sai Korrapati) నిర్మాణ సంస్థలో రజని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రంలో శ్రీలీల (Sreeleela) కథానాయికగా నటించగా, జెనీలియా (Genelia), రవిచంద్ర (Ravi Chandra) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందించగా, కె.కె. సెంధిల్ కుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకున్నారు. యాక్షన్ పార్ట్‌లను పీటర్ హెయిన్ (Peter Hein) కొరియోగ్రఫీ చేశారు.

పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదలకు సన్నాహాలు జరుపుతున్న ఈ చిత్రాన్ని జూలై 18, 2025 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఒకవైపు తండ్రి గాలి జనార్దన్ రెడ్డి జైలులో ఉండగా, మరోవైపు కొడుకు కిరీటి నటించిన సినిమా జాతీయ స్థాయిలో విడుదలకానుండడం హాట్ టాపిక్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories