Ram Charan: ఆ సమయంలో పాపను ఉపాసనే చూసుకుంటారు.. క్లీంకార కేర్‌ టేకర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

Ram Charan: ఆ సమయంలో పాపను ఉపాసనే చూసుకుంటారు.. క్లీంకార కేర్‌ టేకర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 31 July 2024 6:26 PM IST
Klin kaara care taker lalita interesting comments about ram charan and upasana
X

Ram Charan: ఆ సమయంలో పాపను ఉపాసనే చూసుకుంటారు.. క్లీంకార కేర్‌ టేకర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ 

Ram Charan: సెలబ్రిటీల పిల్లలను యోగాక్షేమాలను చూసుకునేందుకు కేర్‌ టేకర్స్‌ను ఏర్పాటు చేసుకుంటారనే విషయం తెలిసిందే. సినిమాలు, వ్యాపారాలతో బిజీగా ఉండే వారి చిన్నారుల సంరక్షణ కోసం ఆయాలను ప్రత్యేకంగా నియమించుకుంటారు. నటుడు రామ్‌చరణ్‌-ఉపాసన దంపతులు కూడా లలిత అనే మహిళను క్లీంకారాకు ఆయాగా నియమించుకున్నారు.

లలిత గతంలో అంబానీ కుటుంబంతో పాటు దక్షిణాదికి చెందిన ఎంతో మంది సెలబ్రిటీ కపుల్స్‌ చిన్నారులకు ఆయాగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన లలిత.. రామ్‌చరణ్‌-ఉపాసన దంపతులపై ప్రశంసలు కురిపించారు. వారిద్దరూ మంచి పేరెంట్స్‌ అని, పాప విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్పుకొచ్చారు. రామ్‌చరణ్‌-ఉపాసన జంటకు సంబంధించిన పలు ఆసక్తికర వియాలను సైతం ఆమె పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లడుతూ.. తాను ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్‌ కిడ్స్‌కు ఆయాగా పనిచేశానని, తనను అందరూ బాగా చూసుకున్నారని తెలిపారు. తమ కుటుంబాల్లోకి గొప్ప మనసుతో స్వాగతించారని ప్రస్తుతం రామ్‌చరణ్‌ - ఉపాసన దంపతుల నుంచి కూడా అలాంటి ఆదరణ లభిస్తోందని చెప్పుకొచ్చారు. ఇక ఉత్తరాదికి, ఇక్కడికి ఉన్న ప్రధాన వ్యత్యాసం ఆహార పద్ధతులని ఆమె తెలిపారు.

రామ్‌చరన్‌-ఉపాసనలు చాలా మంచి వారని తెలిపిన లలిత.. తాను విశ్రాంతి తీసుకునే సమయంలో పాపను ఉపాసనే చూసుకుంటారని చెప్పుకొచ్చారు. అపోలో ఫౌండేషన్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ అయినప్పటికీ ఉపాసన చాలా సింపుల్‌గా ఉంటారని తెలిపారు. ఆమెది ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వమని, బేబీ విషయంలో ఎప్పుడూ నాకు ఆర్డర్స్‌ వేయడం కానీ, ఫోర్స్‌ చేయడం కానీ చేయలేదన్నారు. తనను కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకుంటారని లలిత చెప్పుకొచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story