కృతి శెట్టి ఆ ఇద్దరికీ హిట్ ఇవ్వగలదా?

*కృతి శెట్టి ఆ ఇద్దరికీ హిట్ ఇవ్వగలదా?

admin1
Updated on: 21 April 2022 9:00 AM IST
Krithi Shetty Acting with Sudheer Babu Movie
X

కృతి శెట్టి ఆ ఇద్దరికీ హిట్ ఇవ్వగలదా?

Krithi Shetty: యంగ్ బ్యూటీ కృతి శెట్టి ఈ మధ్యనే "ఉప్పెన" సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. ఈమె తాజాగా "శ్యామ్ సింగరాయి" సినిమాతో కూడా మరొక హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ మధ్యనే ఈమె నటించిన "బంగార్రాజు" సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇలా హ్యాట్రిక్ హిట్ తో వెండితెరపై దూసుకుపోతున్న కృతి శెట్టి చేతిలో ఇప్పుడు బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి.

అయితే అందులో ఒక సినిమా వల్ల కృతి శెట్టి కరియర్ కి అడ్డు కాబోతోందని కొందరు అభిమానులు భయపడుతున్నారు. ఆ సినిమానే "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి". సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సమ్మోహనం, వీ 'V'సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడవ సినిమా ఇది.

చిన్న బడ్జెట్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా పైనే వీరిద్దరూ తమ ఆశలు పెట్టుకున్నారు. వీ 'V' సినిమా ఫ్లాప్ అవడంతో ప్రస్తుతం ఈ సినిమా తో ఎలాగైనా హిట్ అందుకోవాలని ఈ ఇద్దరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి టాలీవుడ్ లో లక్కీ చార్మ్ గా పేరు తెచ్చుకున్న కృతి శెట్టి వల్ల ఈ ఇద్దరికీ హిట్ వస్తుందా? లేక ఈ సినిమా ఫ్లాప్ అయితే కృతి కెరీర్ కి ఇబ్బంది అవుతుందా అని ఇంకా తెలియాల్సి ఉంది.

admin1

admin1

Next Story