కుబేరలో బిచ్చగాడి పాత్ర: ధనుష్ సర్‌ప్రైజ్ చేశాడన్న శేఖర్ కమ్ముల

kubera director sekhar kammula on being hesitant to narrate movie to danush
x

 కుబేరలో బిచ్చగాడి పాత్రలో ధనుష్.. ఈ పాత్ర గురించి చెప్పడానికి సంకోచించానన్న శేఖర్ కమ్ముల

Highlights

టాలీవుడ్‌లో క్లాస్ సినిమాలతో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఆయన డైరెక్ట్ చేసిన ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, ఫిదా, లవ్ స్టోరీ వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

టాలీవుడ్‌లో క్లాస్ సినిమాలతో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఆయన డైరెక్ట్ చేసిన ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, ఫిదా, లవ్ స్టోరీ వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ కుబేర. ధనుష్, నాగార్జున, రష్మిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శేఖర్ కమ్ముల ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

కుబేర సినిమాలో ధనుష్ బిచ్చగాడి పాత్రలో నటిస్తున్నారు. అయితే కుబేర కథ సిద్ధమైనప్పుడు బిచ్చగాడి పాత్ర గురించి ధనుష్‌కు ఎలా చెప్పాలా..? అని కాస్త సంకోచించానన్నారు శేఖర్ కమ్ముల. ఎందుకంటే అసలు తాను ఆయనకు తెలుసో లేదోనన్న అనుమానం తనను వెంటాడిందన్నారు. తాను ధనుష్‌కు ఫోన్ చేయగానే.. ధనుష్ తనను ఆశ్చర్యపరిచారన్నారని చెప్పారు. తాను తీసిన సినిమాల గురించి ధనుష్ మాట్లాడారని శేఖర్ కమ్ముల ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ధనుష్‌లాంటి నటుడితో పని చేయడం సంతోషంగా ఉందంటూ శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.

రష్మిక కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. రష్మిక గురించి మాట్లాడిన శేఖర్ కమ్ముల.. ఆమె చాలా కష్టపడతారని చెప్పారు. ఈ కథ చెప్పడానికి వెళ్లినప్పుడు రష్మిక యానిమల్ మూవీ డబ్బింగ్ చెబుతున్నారు. ఇంక పుష్ప2 సినిమా షూటింగ్ కూడా జరుగుతుందన్నారు. ముంబాయి నుంచి హైదరాబాద్ కు విరామం లేకుండా ప్రయాణిస్తూనే ఉన్నారు. కుబేర సెట్‌కు వచ్చినప్పుడు రష్మికలో ఒక్కరోజు కూడా నీరసం, నిస్సత్తువ చూడలేదన్నారు శేఖర్ కమ్ముల. కుబేర సినిమాలో రష్మిక పక్కింటి అమ్మాయిలా కనిపిస్తోందన్నారు. ఇప్పటివరకు రష్మిక, ధనుష్ కలిసి నటించడం చూడలేదు. ఇందులో వారి స్క్రీన్ ప్రజెన్స్ చాలా కొత్తగా ఉంటుందని చెప్పుకొచ్చారు.

ఇదొక భిన్నమైన సోషల్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్నట్టు ప్రచార చిత్రాలను చూస్తే అర్ధమవుతోంది. ఇందులో ధనుష్ బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నారు. రాజకీయాంశాలకు ఇందులో పెద్ద పీట వేసినట్టు తెలుస్తోంది. పైకి బిచ్చగాడిగా కనిపిస్తున్న వ్యక్తి ఎవరు..? అతను ఎందుకు అలా మారాల్సి వచ్చింది..? అతని నేపథ్యం ఏంటనేది ఆసక్తికరంగా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో నాగార్జున ఈడీ అధికారి పాత్రలో నటిస్తున్నట్టు టాక్.

ఈ సినిమాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. మొట్టమొదటి సారి శేఖర్ కమ్ముల పాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories