Kuberaa: కుబేర టికెట్ ధ‌ర పెంపున‌కు అనుమతి.. తెలంగాణ‌లో మాత్రం

Kuberaa
x

Kuberaa: కుబేర టికెట్ ధ‌ర పెంపున‌కు అనుమతి.. తెలంగాణ‌లో మాత్రం

Highlights

Kuberaa: నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన 'కుబేర' సినిమా విడుదలకు రెడీ అయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ పాన్-ఇండియా చిత్రం జూన్ 20న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Kuberaa: నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన 'కుబేర' సినిమా విడుదలకు రెడీ అయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ పాన్-ఇండియా చిత్రం జూన్ 20న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా రిలీజ్ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రిలీజ్ రోజు నుండి 10 రోజుల పాటు, మల్టీప్లెక్స్‌లతో పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి లభించింది. తాజా నిర్ణయం ప్రకారం, ప్రతి టికెట్‌పై రూ.75 వరకు అదనంగా వసూలు చేయవచ్చు (జీఎస్టీ అదనం).

తెలంగాణలో మాత్రం

ఇక తెలంగాణ రాష్ట్రంలో మాత్రం టికెట్ రేట్లు యధాతథంగా కొనసాగనున్నాయి. ఈ మేరకు 'కుబేర' చిత్ర బృందం అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధరల పెంపు కోసం ఎటువంటి విజ్ఞప్తి చేయలేదు. అందువల్ల తెలంగాణలో ఉన్న అన్ని థియేటర్లలో సాధారణ టికెట్ ధరలకే సినిమా చూడొచ్చు.

భారీ రన్‌టైమ్‌తో 'కుబేర'

సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసిన తర్వాత, కొన్ని సవరణలతో ‘కుబేర’ సినిమా మొత్తం 182 నిమిషాలు 38 సెకన్ల నిడివితో థియేటర్లలోకి రాబోతోంది. అంటే సుమారుగా 3 గంటల 2 నిమిషాలు. సాధారణంగా పెద్ద బడ్జెట్ సినిమాలు మాత్రమే ఈ స్థాయిలో ఉంటాయి. కానీ, సోషల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ మేరకు నిడివి కలిగి ఉండటం, కథపై దర్శకుడి నమ్మకాన్ని చూపిస్తోంది.

తెలుగు వెర్షన్‌ నిడివిలో స్వల్ప మార్పు

తెలుగు వెర్షన్ నిడివి తమిళంతో పోలిస్తే కాస్త తక్కువగా ఉంటుందని శేఖర్ కమ్ముల వెల్లడించారు. సాంకేతిక కారణాల వల్ల ఒక్క నిమిషం కట్ చేయాల్సి వచ్చిందని, అయితే ఈ మార్పు కథపై ఎలాంటి ప్రభావం చూపదని ఆయన స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories