Kuberaa OTT Release Date Update: ఓటీటీలోకి కుబేర వస్తోంది.. డేట్ ఫిక్స్

Kuberaa OTT Release Date Update
x

Kuberaa OTT Release Date Update: ఓటీటీలోకి కుబేర వస్తోంది.. డేట్ ఫిక్స్

Highlights

Kuberaa OTT Release Date Update: కింగ్ నాగార్జున, తమిళ స్టార్ ధనుష్, రష్మిక మందన్న నటించిన శేఖర్ కమ్ముల సినిమా ‘కుబేర’ త్వరలో ఓటీటీలోకి రానుంది.

Kuberaa OTT Release Date Update: కింగ్ నాగార్జున, తమిళ స్టార్ ధనుష్, రష్మిక మందన్న నటించిన శేఖర్ కమ్ముల సినిమా ‘కుబేర’ త్వరలో ఓటీటీలోకి రానుంది. దీనికోసం ఒక డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. విభిన్న చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించడం.. తమిళ స్టార్ ధునుష్ సార్ తర్వాత తెలుగులో నటించిన రెండో డైరెక్ట్ సినిమా కావడం.. ఈ సినిమా స్పెషల్. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను రిలీజ్‌కు ముందు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక ఇప్పుడు కుబేర తమ ఫ్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేసింది. ఈ నెల 18న కుబేర అమెజాన్ ప్రైమ్‌లో మొదలవుతుంది.

తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషలలో పాటు హిందలోనూ స్ట్రీమింగ్ చేస్తోంది. జూన్ 20 ధియేటర్లలో రిలీజ్ అయిన కుబేర సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన 28 రోజుల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు వస్తోంది. మరి ఓటీటీలో ఎన్ని వ్యూస్ వస్తాయో వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories