Laalo Krishna Sada Sahayate: కేవలం కోటి బడ్జెట్‌తో తీస్తే... 70 కోట్లు కొల్లగొట్టిన గుజరాతీ సినిమా..!

Laalo Krishna Sada Sahayate: కేవలం కోటి బడ్జెట్‌తో తీస్తే... 70 కోట్లు కొల్లగొట్టిన గుజరాతీ సినిమా..!
x

Laalo Krishna Sada Sahayate: కేవలం కోటి బడ్జెట్‌తో తీస్తే... 70 కోట్లు కొల్లగొట్టిన గుజరాతీ సినిమా..!

Highlights

Laalo Krishna Sada Sahayate: కేవలం 1 కోటి బడ్జెట్‌తో తెరకెక్కిన ఓ గుజరాతీ చిత్రం అద్భుత వసూళ్లతో రికార్డులు బద్దలు కొట్టింది.

Laalo Krishna Sada Sahayate: కేవలం 1 కోటి బడ్జెట్‌తో తెరకెక్కిన ఓ గుజరాతీ చిత్రం అద్భుత వసూళ్లతో రికార్డులు బద్దలు కొట్టింది. ఏడు వారాల్లోనే 70 కోట్లు దాటి 100 కోట్ల క్లబ్‌ను అందుకోనుంది. ఆ సినిమా ఏంటి?

అక్టోబర్ 10న విడుదలైన ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ గుజరాతీ సినీ చరిత్రలో కొత్త అధ్యాయం రాస్తోంది. మొదటి మూడు వారాలు నెమ్మదిగా సాగిన ఈ చిత్రం నాలుగో వారం నుంచి అద్భుత వేగం పుంజుకుంది. మంచి మాట, భావోద్వేగాలు, సంగీతం కలిసి ఈ చిత్రాన్ని అన్‌స్టాపబుల్ చేశాయి.

గుజరాతీలో ఇప్పటివరకు అత్యధిక వసూలు చేసిన ‘చాల్ జీవి లైయే’ 50 కోట్ల రికార్డును ‘లాలో’ బద్దలు కొట్టింది. ఏడు వారాల్లో 70 కోట్లు దాటి, ప్రస్తుతం 100 కోట్ల మార్కు వైపు దూసుకెళ్తోంది. కేవలం 1 కోటి బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాతలకు అనూహ్య లాభాలు అందించింది. మంచి కథకు బడ్జెట్ అడ్డు కాదని ఈ సినిమా మరోసారి నిరూపించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories