Tollywood: క్రేజీ అప్‌డేట్‌.. రామ్ చ‌ర‌ణ్ హీరోగా ప‌వ‌న్ క‌ళ్యాణ్

Tollywood
x

Tollywood: క్రేజీ అప్‌డేట్‌.. రామ్ చ‌ర‌ణ్ హీరోగా ప‌వ‌న్ క‌ళ్యాణ్

Highlights

Tollywood: ‘ఉప్పెన’తో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు రెండో సినిమా ‘పెద్ది’లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఆర్ఆర్ఆర్, గేమ్ ఛేంజర్ వంటి భారీ చిత్రాల తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

Tollywood: ‘ఉప్పెన’తో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు రెండో సినిమా ‘పెద్ది’లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఆర్ఆర్ఆర్, గేమ్ ఛేంజర్ వంటి భారీ చిత్రాల తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తయ్యింది. రెగ్యులర్ షెడ్యూల్‌లో చరణ్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను 2026లో విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ‘పెద్ది’ తర్వాత రామ్ చరణ్ ఏ చిత్రాన్ని చేస్తారన్నది అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. RC17 అనే ప్రాజెక్ట్‌కి సంబంధించిన సమాచారం ప్రస్తుతం ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇదే క్రమంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చరణ్ తదుపరి సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని టాక్. పుష్ప డైరెక్టర్ సుకుమార్ పేరు కూడా చర్చలో ఉన్నా.. త్రివిక్రమ్ పేరే ఎక్కువ‌గా వినిపిస్తోంది. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికర సమాచారం వైర‌ల్ అవుతోంది. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ నిర్మాతగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. అంటే రామ్ చరణ్ హీరోగా, త్రివిక్రమ్ డైరెక్టర్‌గా, పవన్ నిర్మాతగా ఈ సినిమా రానుంద‌న్న‌మాట‌. మ‌రి ఈ వార్త‌లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories