Mangalavaaram: మంగళవారం సీక్వెల్‌పై క్రేజీ అప్‌డేట్.. త్వరలోనే

Mangalavaaram: మంగళవారం సీక్వెల్‌పై క్రేజీ అప్‌డేట్.. త్వరలోనే
x
Highlights

Mangalavaaram: అందాల తార పాయల్‌ రాజ్‌పుత్ ఇండస్ట్రీకి పరిచయమైన చిత్రం RX 100.

Mangalavaaram: అందాల తార పాయల్‌ రాజ్‌పుత్ ఇండస్ట్రీకి పరిచయమైన చిత్రం RX 100. అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీని షేక్‌ చేసింది. తొలి సినిమాతోనే తనదైన అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ చిన్నది. ఈ సినిమా ద్వారా పాయల్‌కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే ఆశించిన స్థాయిలో విజయాలను మాత్రం అందుకోలేక పోయింది.

అయితే చాలా గ్యాప్‌ తర్వాత తనకు మొదటి విజయాన్ని అందించిన అజయ్‌ భూపతి మళ్లీ పాయల్‌ కెరీర్‌ను మలుపు తిప్పాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మంగళవారం మూవీ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సస్పెన్స్‌, రొమాంటిక్‌ జానర్‌లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో పాయల్‌ బోల్డ్‌ క్యారెక్టర్‌లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథను పూర్తి చేసుకున్న అజయ్‌ భూపతి త్వరలోనే సినిమాను పట్టాలెక్కించే పనిలో పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మంగళవారం సీక్వెల్‌లో పాయల్‌ హీరోయిన్‌గా నటించే అవకాశాలు లేదని తెలుస్తోంది.

ఇందుకోసం అజయ్‌ మరో హీరోయిన్‌ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్‌ ఎవరనే చర్చ నడుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇందుకోసం అజయ్‌ కొత్త హీరోయిన్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరి మంగళవారం సీక్వెల్‌తో అజయ్‌ ఇంకెలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories