Lavanya Tripathi: నటి లావణ్య త్రిపాఠికి ఆన్లైన్ వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు!

Lavanya Tripathi: నటి లావణ్య త్రిపాఠికి ఆన్లైన్ వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు!
Lavanya Tripathi: టాలీవుడ్ నటి లావణ్య త్రిపాఠి కొణిదెల సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న వేధింపులపై పోలీసులను ఆశ్రయించారు.
Lavanya Tripathi: టాలీవుడ్ నటి లావణ్య త్రిపాఠి కొణిదెల సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న వేధింపులపై పోలీసులను ఆశ్రయించారు. తన గౌరవానికి భంగం కలిగించేలా, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కేసు వివరాలు:
గత కొంతకాలంగా ‘పర్పుల్ క్రెయాన్00’ (Purple Crayon00) అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు, కామెంట్లు పెడుతున్నారని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు ఖాతాదారుడు తన వ్యక్తిగత జీవితంపై నిందలు వేస్తూ, నైతిక విలువలను ప్రశ్నించేలా ప్రచారం చేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసుల చర్యలు:
లావణ్య త్రిపాఠి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ చట్టం సెక్షన్ 67తో పాటు, భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 78, 79 కింద కేసు నమోదు చేశారు. ఈ వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించామని, సదరు ఇన్స్టా ఖాతాలోని అభ్యంతరకర పోస్టులను తొలగించేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలను వేధించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



