
Lokesh Kanagaraj: తన స్పీడుతో షాక్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్
Lokesh Kanagaraj: అప్పుడే 50 శాతం షూటింగ్ పూర్తి చేసిన స్టార్ డైరెక్టర్
Lokesh Kanagaraj: పాన్ ఇండియా సినిమా అంటే షూటింగ్ కి చాలామంది డైరెక్టర్లు ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటారు. కానీ ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మాత్రం ఈ జాబితాలో చేరరని చెప్పుకోవచ్చు. "ఖైదీ", "విక్రమ్" వంటి సూపర్ హిట్ సినిమాలతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ని సృష్టించిన లోకేష్ తాజాగా ఇప్పుడు ఇందులోని మూడవ సినిమాగా "లియో" కి దర్శకత్వం వహిస్తున్నారు. దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 50% పూర్తయిపోయిందట.
ఇక జూన్ కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ లోనే సినిమాని విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లోకేష్ తన షూటింగ్ లను చాలా త్వరగా పూర్తి చేయడానికి వెనక ఒక కారణం ఉంది. సినిమా షూటింగ్ మొదలవ్వకముందే లోకేష్ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు. ఈ మధ్యనే ఒక షూటింగ్ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న చిత్ర బృందం సినిమా టెక్నీషియన్లను పొగుడుతూ ఒక ట్వీట్ చేసింది.
కాశ్మీర్ వ్యాలీ కి సంబంధించిన కొన్ని అద్భుతమైన విజువల్స్ తో మొదలైన ఈ వీడియోలో మాట్లాడుతూ ఒక టెక్నీషియన్ చలి కారణంగా షూటింగ్ సమయంలో తమ చేతులు గడ్డగడుతూ ఉండేవని పనిచేయటం చాలా కష్టమైందని అన్నారు. ముఖ్యంగా రాత్రులు కాశ్మీర్లో టెంపరేచర్ మైనస్ 2 కి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో సినిమా జూనియర్ ఆర్టిస్టులకు కాస్ట్యూమ్స్ అందించిన వారు కనీసం సూది కూడా పట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇలా వీడియో లో మొత్తం చిత్ర బృందం పడిన కష్టం కనిపిస్తుంది. ఇక విజయ్ కూడా చలిలో షూటింగ్ చేస్తూ ఈ వీడియోలో కనిపించారు. విజయ్ అక్కడి లోకల్ జనాలు మరియు మిలిటరీ వారితో కూడా ఇంటరాక్ట్ అయ్యారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.
Massive respect to the cast and crew of #LEO who worked really hard no matter what, in the process of entertaining people.
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) March 23, 2023
This tribute is for you all #TheCrewBehindLEO ❤️🙌🏻#KashmirScheduleWraphttps://t.co/xa4jA0a3CG

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire