సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతిపై మహేశ్‌ బాబు ఎమోషనల్‌ పోస్ట్‌.. లవ్యూ నాన్న..

Mahesh Babu Pens Emotional Note as he Remembers His Dad Superstar Krishna
x

సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతిపై మహేశ్‌ బాబు ఎమోషనల్‌ పోస్ట్‌.. లవ్యూ నాన్న..

Highlights

Superstar Krishna: లెజెండరీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మరణంతో టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసినట్టు అయ్యింది.

Superstar Krishna: లెజెండరీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మరణంతో టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసినట్టు అయ్యింది. సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు అనే చేదు నిజాన్ని ఇంకా ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. దాదాపు 350కు పైగా సినిమాలలో నటించి కోట్లాదిమంది అభిమానుల మనసు గెలుచుకున్న కృష్ణ నవంబర్‌ 15న గుండె పోటు కారణంగా తుది శ్వాస విడిచారు. కాగా మహేష్ బాబు తన తండ్రి కృష్ణ మరణాన్ని తలుకుంటూ సోషల్‌ మీడియా వేదికగా ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేశారు.

"మీ జీవితాన్ని ఎంతో ఆనందంగా, ఉత్సాహాంగా గడిపారు.. మీరు వెళ్లిపోవడం అంతకన్నా గొప్పగా జరిగింది. అదే మీ గొప్పతనం. మీరు మీ జీవితాన్ని నిర్భయంగా గడిపారు..ధైర్యం. చురుకైన స్వభావం మీది. నా స్పూర్తి.. నా ధైర్యం.. మీలో నేను చూసుకున్నవన్నీమీతోనే వెళ్లిపోయాయి. కానీ విచిత్రమేమిటంటే, నేను ఇంతకు ముందెన్నడూ అనుభవించని ఈ శక్తిని నాలో అనుభవిస్తున్నాను.. ఇప్పుడు నేను నిర్భయంగా ఉన్నాను.. మీవెలుగు నాలో ఎప్పటికీ ప్రకాశిస్తుంది. వారసత్వాన్ని ముందుకు తీసుకువెళతాను. మీరు మరింత గర్వపడేలా చేస్తాను.. లవ్ యూ నాన్నా.. మై సూపర్ స్టార్" అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories