Mahesh Babu: మాస్ ఘాటుతో మహేష్ బాబు గుంటూరు కారం..

Mahesh Babu: మాస్ ఘాటుతో మహేష్ బాబు గుంటూరు కారం..
x

Mahesh Babu: మాస్ ఘాటుతో మహేష్ బాబు గుంటూరు కారం

Highlights

గుంటూరు కారం టైటిల్ మహేష్ బాబుకి సెట్ అవుతుందా అని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ తో దర్శకుడు త్రివిక్రమ్ సందేహాలను పటాపంచలు చేసేశారు. మహేష్ బాబుని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నట్లు అర్థం అవుతుంది.


Mahesh Babu: శేఖర్ కృష్ణ జయంతి సందర్భంగా SSMB28 టైటిల్ ను మేకర్స్ రివీల్ చేశారు. ముందుగా లీకైనట్లే సినిమా టైటిల్ ని గుంటూరు కారంగా కన్ ఫామ్ చేస్తూ అఫీషియల్ టైటిల్ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ లో మహేష్ బాబు ఊర మాస్ లుక్ లో దర్శనం ఇచ్చి మైండ్ బ్లాక్ చేశాడు. సినిమా టైటిల్ మాస్ కి కనెక్ట్ కావడం ఖాయంగా ఉంది. మాస్ స్ట్రయిక్ అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా టైటిల్ ఉందని ఘట్టమనేని అభిమానులు సంబరపడుతున్నారు. ఇక గ్లిమ్స్ చూస్తుంటే మహేష్ బాబుని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నట్లు అర్థం అవుతుంది. మహేష్ గెటప్ తో పాటు డైలాగ్ డెలివరీ కూడా వేరే లెవల్ లో ఉంది.

బీడీ 3డీలో కనిపిస్తుందా అంటూ మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఊర మాస్ గా ఉంది. జీప్ పేలిపోయే సన్నివేశం, సూపర్ స్టార్ తన కాలికి అంటిన దుమ్మును దులుపుకునే స్టయిల్ సైతం అల్టిమేట్ గా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాస్ బీట్ సైతం గ్లిమ్స్ లెవల్ ను పెంచింది. ఓవరాల్ గా గ్లిమ్స్ చూస్తుంటే వచ్చే సంక్రాంతికి గుంటూరు కారం ఘాటుకు బాక్సాఫీసులు మోత మోగడం గ్యారెంటీ. గతంలో త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలను గుంటూరు కారం మరిపించడం ఖాయమనే చెప్పాలి.

మొత్తంగా, గుంటూరు కారం టైటిల్ మహేష్ బాబుకి సెట్ అవుతుందా అని అనుమానాలు వ్యక్తం అయ్యాయి..తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ తో దర్శకుడు త్రివిక్రమ్ సందేహాలను పటాపంచలు చేసేశారు. ఇకపోతే, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న గుంటూరు కారంలో మహేష్ కి జోడీగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం ముస్తాబౌతుండగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ ని జూన్ 5 నుంచి స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories