Jr NTR: ‘దేవర 2’పై ఎన్టీఆర్ వెనకడుగు?

Jr NTR: ‘దేవర 2’పై ఎన్టీఆర్ వెనకడుగు?
x

 Jr NTR: ‘దేవర 2’పై ఎన్టీఆర్ వెనకడుగు?

Highlights

Jr NTR: ఎన్టీఆర్ ‘దేవర’ సీక్వెల్‌పై ఇండస్ట్రీలో కొత్త టాక్ నడుస్తోంది. కొరటాల శివ రాసిన కొత్త డ్రాఫ్ట్ ఎన్టీఆర్‌ను మెప్పించలేదట.

Jr NTR: ఎన్టీఆర్ ‘దేవర’ సీక్వెల్‌పై ఇండస్ట్రీలో కొత్త టాక్ నడుస్తోంది. కొరటాల శివ రాసిన కొత్త డ్రాఫ్ట్ ఎన్టీఆర్‌ను మెప్పించలేదట. క్రియేటివ్ కారణాలతో ప్రాజెక్ట్ షెల్ఫ్‌లో పడే అవకాశం కనిపిస్తోంది.

‘దేవర’ మిక్స్‌డ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. సీక్వెల్ ఖాయమని అందరూ భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కొరటాల శివ సీక్వెల్ కోసం కొత్త కథ రూపొందించి ఎన్టీఆర్‌కు వినిపించగా, ఆ కథ ఆశించిన స్థాయిలో లేదని తారక్ భావించినట్టు సమాచారం. మొదటి భాగానికి సహజ కొనసాగింపు లేకపోవడం, బలవంతంగా సాగదీసినట్టు అనిపించడంతో ఎన్టీఆర్ పునరాలోచనలో పడ్డారట.

బలమైన కథ లేకుండా సీక్వెల్ చేస్తే మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయం. క్వాలిటీకి రాజీపడకుండా ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టడమే మంచిదని నిర్ణయించినట్టు టాక్. ఈ కఠిన నిర్ణయం లాంగ్ టర్మ్ కెరీర్‌కు మేలు చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories