Malaika Arora's Father Suicide: మలైకా అరోరా తండ్రి సూసైడ్.. బిల్డింగ్‌పై నుండి దూకి..

Malaika Arora Father Suicide
x

Malaika Arora Father Suicide

Highlights

Malaika Arora's Father Suicide News: ప్రముఖ బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు.

Malaika Arora's Father Suicide News: ప్రముఖ బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం ఆయన ముంబైలోని తన నివాసం వద్ద బిల్డింగ్ టెర్రస్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇవాళ ఉదయం 9 గంటలకు ఈ ఘటన జరిగింది. అనిల్ అరోరా సూసైడ్ న్యూస్ తెలుసుకున్న పోలీసులు భారీ సంఖ్యలో బాంద్రాలో ఉన్న ఆయన నివాసానికి చేరుకున్నారు. అనిల్ అరోరా ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ప్రస్తుతం ముంబై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ దుర్ఘటన జరిగినప్పుడు పూణెలో ఉన్న మలైకా అరోరా వెంటనే తన ఇంటికి చేరుకున్నారు. మలైకా అరోరా మాజీ భర్త అర్బాజ్ ఖాన్ కూడా అనిల్ అరోరా ఇంటికి చేరుకున్నారు.

అనిల్ అరోరా ప్రస్తుతం తన భార్య జాయిసి పాలికార్ప్ తో కలిసి బాంద్రా వెస్ట్‌లోని ఆయేషా మెనార్‌లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం అనిల్ అరోరా నివాసం వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మొహరించి ఉన్నారు. పంచనామా పూర్తి చేసిన అనంతరం అనిల్ అరోరా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం బాబా హాస్పిటల్‌కి తరలించనున్నట్లు ముంబై మీడియా కథనాలు స్పష్టంచేస్తున్నాయి.

అనిల్ అరోరా నేపథ్యం ఏంటి?

అనిల్ అరోరా పంజాబ్‌కి చెందిన వ్యక్తి. ఇండియన్ మర్చంట్ నేవీలో పనిచేశారు. జాయిసి మలయాళీ క్రిస్టియన్. మలైకా అరోరా, అమృత అరోరా ఇద్దరు కూతుళ్లు. మలైకా అరోరా గతంలో ఫిలింఫేర్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 11 ఏళ్లు ఉన్నప్పుడే తన తల్లితండ్రులు విడిపోయారని.. అప్పటి నుండి తన తల్లే తమ బాగోగులు చూసుకుందని వెల్లడించారు. అప్పుడప్పుడు తండ్రితో కలిసి సరదాగా గడిపేవాళ్లమని తన చిన్ననాటి సంగతులను నెమరేసుకున్నారు.

తన బాల్యం సాఫీగానే సాగిపోయినప్పటికీ.. అందులోనూ కొంత ఇబ్బందులు ఉండేవని మలైకా అరోరా చెప్పుకొచ్చారు. తండ్రి నుండి దూరమయ్యాకా తాము థానెకి షిఫ్ట్ అయ్యామని.. అక్కడే తాము పెరిగి పెద్దయ్యామని మలైకా అరోరా ఆ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం మలైకా అరోరా కూడా అదే బాంద్రా వెస్ట్‌లో ఉన్న పాలి హిల్స్ ప్రాంతంలో ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు.

మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్యకు కారణాలు?

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామందిని వేధిస్తోన్న ప్రశ్న ఒక్కటే.. మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్యకు కారణాలు ఏంటి ? ఈ వయస్సులో ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలోపడ్డారు. ఈ ఆత్మహత్య వెనుక ఏవేవో ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ.. అసలు కారణాలు ఏంటనే విషయంలోనే ఇంకా స్పష్టత లేదు. అర్బాజ్ ఖాన్ ప్రస్తుతం అక్కడే ఉండి ముంబై పోలీసులతో మాట్లాడుతూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories